డిప్యూటీ CM పవన్‌కు తంబీల ఘనమైన స్వాగ్
పవర్ హౌస్.. సుప్రీం పవర్.. సూపర్ పవర్.. ఇవన్నీ రాజకీయాలతో ఎలా వెతుక్కుంటూ వస్తాయో.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యక్షంగా చూస్తున్నారు.
By: Tupaki Desk | 23 Jun 2025 9:17 AM ISTపవర్ హౌస్.. సుప్రీం పవర్.. సూపర్ పవర్.. ఇవన్నీ రాజకీయాలతో ఎలా వెతుక్కుంటూ వస్తాయో.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అందుకున్న స్వాగ్ ని చూసాక మరోసారి పవర్ పాలిటిక్స్ స్టామినాను అర్థం చేసుకోవచ్చు.
పవన్ మధురైలో అడుగుపెడుతూ ఉంటే.. తంబీలు గౌరవంగా ఆహ్వానించారు. ఆయన అలా స్పెషల్ గా ఎరేంజ్ చేసిన చాపర్ నుంచి దిగి వస్తుంటే, ఆ ఇస్టయిల్ అందరి దృష్టిని ఆకర్షించింది. తెల్లపంచె, తెల్ల చొక్కా, కళ్లకు గాగుల్స్ తో పవన్ చాలా స్టైలిష్ గా కనిపించారు. పవన్ ఏ కార్యక్రమానికి వెళ్లినా కానీ, ఆయన రూపం, లుక్ అండ్ ఫీల్ గురించి చర్చించుకునేలా తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా చర్చగా మారుతున్నాయి.
ఆదివారం సాయంత్రం లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో, మురుగన్ కు నెలవైన తమిళనాడు రాష్ట్రంలో, మీనాక్షి అమ్మవారు కొలువైన మధురై నగరంలో జరగనున్న `మురుగ భక్తర్గల్ మానాడు` కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ఇన్ స్టాలో ధృవీకరించారు.
మధురైలో జరిగిన మురుగన్ సమావేశంలో ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక బలమైన ప్రకటన కూడా చేశారు. హిందూ విశ్వాసాలను, ముఖ్యంగా మురుగన్ భక్తులను `ఎగతాళి చేసే లేదా రెచ్చగొట్టే` వారిని ఆయన హెచ్చరించారు. కొంతమంది రాజకీయ నాయకులు `ప్రమాదకరమైన వేర్పాటువాద ఆలోచనలను` ప్రోత్సహిస్తున్నారని, లౌకికవాదం ముసుగులో హిందూ ఆచారాలను టార్గెట్ చేస్తున్నారని పవన్ ఆరోపించారు.
కొంతమంది స్వయం ప్రకటిత నాస్తికులు, లౌకికవాదులు హిందూ మతాన్ని మాత్రమే అపహాస్యం చేస్తూ, ఇతర మతాల పట్ల మౌనంగా ఉంటారని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. అరేబియాలో పుట్టిన మతాల గురించి మీరు ఇలానే ప్రశ్నించగలరా? అని కూడా పవన్ ధుమధుమలాడారు. మురుగన్ ను తమిళ దేవుడు మాత్రమే కాదు. ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో గౌరవించబడే పాన్-ఇండియన్ దేవుడని పవన్ అన్నారు. ఉత్తరాదిన కాకుండా తమిళనాడు దేవుడి దగ్గరకే పవన్ ఎందుకు పర్యటిస్తున్నారు? అనే ప్రత్యర్థుల ప్రశ్నకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. పరోక్షంగా డీఎంకే పార్టీ చర్యలను పవన్ విమర్శించారని ప్రజలు దీనిని బట్టి అర్థం చేసుకున్నారు.
