వీరమల్లు కంటే హై రేంజ్ లో OG.. వీరమల్లు డైరెక్టర్ ఏమన్నారంటే?
ఇలా ‘ఓజీ’కి వచ్చిన క్రేజ్, వల్ల హైప్ విషయంలో ‘వీరమల్లు’ వెనుకపడటం గురించి తాజాగా దర్శకుడు జ్యోతికృష్ణ స్పందించారు.
By: Tupaki Desk | 18 July 2025 12:45 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మారిన తరువాత వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. అందులోనూ పొలిటికల్ పరంగా పవన్ దేశవ్యాప్తంగా ఫోకస్ కావడంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుంది అనేది మరో ఆసక్తికరమైన విషయం. మరోవైపు OG కూడా లైనప్ లో ఉంది. ఒకదానికొకటి కేవలం రెండు నెలల వ్యవధిలో థియేటర్స్ కు రాబోతున్నాయి. జూలై 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు, ఆ తర్వాత సెప్టెంబర్ 25న ఓజీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ రెండు చిత్రాల మీద అభిమానుల్లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే హైప్ విషయంలో మాత్రం ఓజీదే ఆధిక్యత అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఈ రెండు సినిమాల్లో ‘ఓజీ’కే ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు సినీ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముంబయి గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో పవన్ స్టైల్‌కి తగ్గట్టుగా డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి ప్రోమో నుంచే హైప్ ఎగిరిపోయింది.
ఫ్యాన్సీ రేట్లకు బిజినెస్ క్లోజ్ అవుతోంది. ఇక ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్ట్ అయితే చాలాకాలంగా నిలిచిపోయింది. డైరెక్టర్ మారడం, వాయిదాలు, అప్‌డేట్ల లేని పరిస్థితి వల్ల హైప్ తగ్గిందన్నది ఒప్పుకోక తప్పదు. ఇలా ‘ఓజీ’కి వచ్చిన క్రేజ్, వల్ల హైప్ విషయంలో ‘వీరమల్లు’ వెనుకపడటం గురించి తాజాగా దర్శకుడు జ్యోతికృష్ణ స్పందించారు.
‘‘మా సినిమా నాలుగేళ్ల కిందట మొదలైంది. పవన్ కళ్యాణ్ గారి తొలి పీరియాడిక్ మూవీగా పెద్ద అంచనాలు నెలకొన్నాయి. కానీ కరోనా, ఇతర అంశాల వల్ల ఆలస్యం అయింది. అప్పుడు ఓ దశలో అప్‌డేట్లు కూడా ఆగిపోయాయి. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా అప్డేట్స్ కోసం చాలా రోజులు ఎదురుచూశారు. ఆ టైమ్ లో ‘ఓజీ’ మొదలై వెంటనే హైప్ అందుకుంది. పవన్ గారి మాస్ స్టయిల్‌ను బాగా క్యాచ్ చేసింది. కానీ మేము మళ్లీ బలంగా వస్తున్నాం’’ అని ఆయన అన్నారు.
అలాగే ‘హరిహర వీరమల్లు’ మొదటి దర్శకుడు క్రిష్ గురించీ కూడా జ్యోతికృష్ణ స్పందించారు. ‘‘నిజానికి నేను క్రిష్ గారి అభిమానిని. ఈ సినిమా ఎక్కువ ఆలస్యం కావడం వల్ల.. ఓ పెద్ద డైరెక్టర్‌ని ఎక్కువకాలం హోల్డ్ చేయడం కరెక్ట్ కాదని భావించాం. అందుకే వారు వేరే ప్రాజెక్ట్స్‌కి వెళ్లిపోయారు. తర్వాత ఆయన చెబితేనే నేను ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యాను. ఇది అందరూ కలిసి తీసుకున్న కమీట్మెంట్’’ అని జ్యోతికృష్ణ వివరించారు.
ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తవడంతో హరిహర వీరమల్లు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు ‘ఓజీ’ కూడా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. పవన్ అభిమానులకు ఇది డబుల్ ట్రీట్. రెండు సినిమాలు వేర్వేరు తరహాలో ఉండటంతో వేరే వేరే ఎక్స్‌పీరియన్స్‌ను అందించనున్నాయి. ఒకటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా అయితే, మరొకటి మాస్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ మూవీ. మరి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.
