స్మూత్ గా ఉండొద్దు.. ప్రతి కామెంట్ ను తిప్పికొట్టండి: పవన్ కళ్యాణ్
తాను నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఆయన, తన సినిమాపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై రెస్పాండ్ అయ్యారు.
By: Tupaki Desk | 25 July 2025 10:32 AM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన అభిమానులకు పలు సూచనలు ఇచ్చారు. తాను నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఆయన, తన సినిమాపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై రెస్పాండ్ అయ్యారు. ఆ సమయంలో చేసిన కామెంట్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తన సినిమాను ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే తాను ఎంతగా ఎదిగానో వాళ్లే చెబుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. హరిహర వీరమల్లును బాయ్ కాట్ చేద్దామని బెదిరించారని, ఓ హీరో సినిమా చేస్తే మిమ్మల్ని అది అంత భయపెట్టిందా అని క్వశ్చన్ చేశారు. నెల్లూరు వీధుల్లో పెరిగిన వాడినని, ఇక్కడి దాకా రావడం గొప్ప అని, ఏం చేస్తారో చేసుకోండని చెబుతున్నానంటూ సవాల్ విసిరారు.
ముఖ్యంగా తాటాకు చప్పుళ్లకు బెదిరిపోనని అన్నారు. అయితే తానిలా ఉన్నానంటే దానికి కారణం మీరే అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తానింత బలంగా ఉన్నానంటే కారణం అభిమానులేనని తెలిపారు. ఎంత ఎదిగానో తనకు తెలియదు కానీ, ధైర్యంగా ఉండటం తనకు ఎప్పుడూ తెలుసని చెప్పారు పవన్ కళ్యాణ్.
ఎప్పుడూ కుంగిపోయి కనిపించడం తనకు నచ్చదని చెప్పారు. బతకడమే అద్భుతమైన విషయం అనిపిస్తుందని అన్నారు. విజయం కన్నా బతకడం ముఖ్యమని అనుకుంటానని అన్నారు. మన సినిమా గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు సర్ అంటూ తనకు చెబుతున్నట్లు వెల్లడించారు. అయితే వాళ్లు నెగిటివ్ గా మాట్లాడుతున్నారంటే.. మనం బలమైన వాళ్లమని అర్థమని పవన్ అన్నారు.
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న నెగిటివిటీను చూసి ఎవరూ బాధపడొద్దని పవన్ సూచించారు. ముందు జీవితాన్ని ఆస్వాదించండని తెలిపారు. విమర్శల్ని తేలిగ్గా తీసుకోమని కోరారు. అలా అని సున్నితంగా ఉండకుండా.. ధైర్యంగా తిరిగి విమర్శల దాడి చేయమని వ్యాఖ్యానించారు. ప్రతి సోషల్ మీడియా కామెంట్ ను కూడా తిప్పి కొట్టండంటూ పవన్ చెప్పారు.
ముఖ్యంగా హరిహర వీరమల్లు మూవీ క్లైమాక్స్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. వీఎఫ్ ఎక్స్ వర్క్ బాగోలేదని రివ్యూస్ వచ్చాయని, దానిపై తాము ఫోకస్ చేస్తామని చెప్పారు. అంతే కానీ నెగిటివిటీ ప్రచారం చూస్తే మాత్రం అస్సలు ఊరుకోవద్దని అభిమానులకు ఈ సందర్భంగా సూచించారు.
