Begin typing your search above and press return to search.

వీరమల్లు.. క్రియేటివ్ డిఫరెన్స్ లు వచ్చాయి: పవన్ కళ్యాణ్

దీంతో మేకర్స్ స్పెషల్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించగా.. పవన్ హాజరై మాట్లాడారు. పోడియం లేకుండా మాట్లాడటం కష్టంగా ఉందంటూ నవ్వుతూ స్పీచ్ స్టార్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   21 July 2025 12:32 PM IST
వీరమల్లు.. క్రియేటివ్ డిఫరెన్స్ లు వచ్చాయి: పవన్ కళ్యాణ్
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ హరి హర వీరమల్లు క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జులై 24న పాన్‌ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. దీంతో మేకర్స్ స్పెషల్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించగా.. పవన్ హాజరై మాట్లాడారు. పోడియం లేకుండా మాట్లాడటం కష్టంగా ఉందంటూ నవ్వుతూ స్పీచ్ స్టార్ట్ చేశారు.

"జీవితంలో మొట్టమొదటిసారిగా సినిమా పరంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాను. పొలిటికల్ గా చేశా కానీ సినిమా పరంగా ఎప్పుడూ ఆలోచించలేదు. నేనెప్పుడూ సినిమా పరంగా మొహమాటపడతాను. సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో నాకు తెలియదు. మూవీ గురించి చెప్పడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. నేను యాక్సిడెంటల్ యాక్టర్ ను.. గత్యంతరం లేక టెక్నీషియన్ అయ్యాను" అని తెలిపారు.

"మీడియాతో మాట్లాడడానికి నాకు అహంకారం కాదు. కానీ సినిమా గురించి నాకు చెప్పుకోవడం నచ్చదు. ఇప్పుడు నిర్మాత ఏఎం రత్నం గారి కోసం నేటి ప్రెస్ మీట్ పెట్టాను. ఈవెనింగ్ ఈవెంట్ ఉన్నా.. ఇప్పుడు మీడియాతో మాట్డడడానికి పెట్టా. చిన్నపాటి సౌకర్యం కోసం ఒక యుద్ధమే చేయాలి. అలాంటి సినిమా కోసం ఎన్నో యుద్ధాలు చేయాలి" అని చెప్పారు.

"ఆర్థికంగా, క్రియేటివ్ గా చేయాలి. నేనెప్పుడూ సినిమాల్లోకి రాకముందే రత్నం గారు నా ప్రొడ్యూసర్ కావొచ్చు. రీజనల్ సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. తమిళ సినిమాను ఛాలెంజింగ్ గా డబ్ చేసి స్ట్రయిట్ మూవీతో సమానంగా రిలీజ్ చేసి సత్తా చాటారు. ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం" అని పేర్కొన్నారు.

"రెండు కరోనాలు.. క్రియేటివ్ డిఫరెన్స్ లు సహా అనేక సమస్యలు వచ్చాయి. రాజకీయాల్లోకి వెళ్లాక అదే ప్రైమరీ ఫోకస్ అయిపోయింది. కానీ నా దగ్గరకు వచ్చి కంప్లీట్ చేయాలని అడిగారు. అందుకే నా బెస్ట్ అంతా సినిమాకు ఇచ్చా. టైమ్ ఇవ్వలేకపోయినా.. క్లైమాక్స్ కోసం 57 రోజులు కేటాయించా. ఫుల్ గా ఎండలో చాలా కాలం తర్వాత నటించా" అని వెల్లడించారు.

"ల్యాంగ్ గ్యాప్ తర్వాత మార్షల్ ఆర్ట్స్ సహా అన్నీ ఇప్పుడు పనికొచ్చాయి. సినిమాలో అవే ఆయువు పట్టు. కోల్లారులో దొరికిన కొహినూర్ డైమండ్.. హైదరాబాద్ సుల్తాన్ వరకు ఎలా వచ్చింది.. ఇదే ముఖ్య అంశం. సినిమాకు ఫౌండేషనల్ వర్క్ చేసిన క్రిష్ జాగర్లమూడి.. హై కాన్సెప్ట్ తో నా దగ్గరికి స్క్రిప్ట్ తీసుకొచ్చారు. నచ్చి వెంటనే సినిమా ఓకే చేశాను" అని చెప్పారు పవన్.