Begin typing your search above and press return to search.

వీర‌మ‌ల్లు వ‌ర్సెస్ కింగ్ డ‌మ్ క్లారిటీ ఎప్పుడంటే?

ఇలా ఒక్క‌సారి కాదు వీర‌మ‌ల్లు రిలీజ్ తేదీ ఇచ్చి వెన‌క్కి తీసుకున్న ప్ర‌తీసారి ఇలాంటి స‌న్నివేశం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   2 July 2025 4:01 PM IST
వీర‌మ‌ల్లు వ‌ర్సెస్ కింగ్ డ‌మ్ క్లారిటీ ఎప్పుడంటే?
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన 'హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు' జూలై 24 న రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నో వాయిదాల త‌ర్వాత జూలై 24వ తేదీకి ఫిక్సైంది. అయితే వీర‌మ‌ల్లు ఇలా వాయిదాలు వేసుకుంటూ ఎప్ప‌టిప్పుడు కొత్త తేదీలు ప్ర‌క‌టించ‌డం వ‌ల్ల ఆ తేదీల‌కు ఫిక్సైన చిత్రాలు కొంత గంద‌ర‌గోళానికి గుర‌య్యాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని చూసి ఆ సినిమాలు వెన‌క్కి త‌గ్గాల్సిన ప‌రిస్థితిలు ఏర్ప‌డ్డాయి.

ఇలా ఒక్క‌సారి కాదు వీర‌మ‌ల్లు రిలీజ్ తేదీ ఇచ్చి వెన‌క్కి తీసుకున్న ప్ర‌తీసారి ఇలాంటి స‌న్నివేశం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే స‌రిగ్గా జూలై 25న విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తోన్న 'కింగ్ డ‌మ్' చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసుకున్నారు. ఈ తేదీకి రావ‌డం విజ‌య్ కి ఇష్టం లేదు. కానీ ఓటీటీ ఆ తేదీకి రిలీజ్ చేస్తేనే డీల్ కుదుర్చుకుంటామ‌నే ఒప్పందం పైన ఉంది.

ఇప్పుడు సినిమాల‌న్నీ ఓటీటీ ఇచ్చిన స్లాట్ ప్ర‌కార‌మే థియేట‌ర్లో రిలీజ్ అవుతున్నాయి. కాదు కుద‌ర‌దంటే డీల్ క్యాన్సిల్ చేస్తున్నాయి. అలా నిర్మాత‌లు ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. వీర‌మ‌ల్లు -కింగ్ డ‌మ్ ఒకేసారి రిలీజ్ అయితే న‌ష్టాలు త‌ప్ప‌వు. అది కింగ్ డ‌మ్ కి కావొచ్చు. వీర‌మ‌ల్లుకు కావొచ్చు. ఏ సినిమా బాగుంటే జ‌నాలు ఆ సినిమాకే వెళ్తారు కాబ‌ట్టి ఓ సినిమా కిల్ అవుతుంది.

అదే పోటీ లేకుండా రిలీజ్ అయితే సినిమా పోయినా కొంత వ‌ర‌కూ న‌ష్టాల నుంచి త‌ప్పించుకునే అవకాశం ఉంటుంది. దీంతో చిత్ర నిర్మాత నాగ‌వంశీ కింగ్ డ‌మ్ ని జూలై 25 నుంచి ఆగ‌స్టు 1 మార్చే లా ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఓటీటీని ఒప్పించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హాయం కూడా తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. దీనికి సంబంధించి మ‌రో రెండు రోజుల్లో క్లారిటీ వ‌స్తుంద‌ని వినిపిస్తుంది.