పవన్ కోసం పాత్ర వినకుండానే ఒకే చేసిన భామలు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనతో ఒక్క స్క్రీన్ షేర్ చేసుకుంటే చాలు అని కలలు గనే హీరోయిన్లు ఎందరో ఉన్నారు.
By: Srikanth Kontham | 18 March 2026 5:30 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనతో ఒక్క స్క్రీన్ షేర్ చేసుకుంటే చాలు అని కలలు గనే హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అందుకే చాలా మంది భామలు తమ పాత్ర నిడివి ఎంత? కథలో ప్రాధాన్యత ఏంటి? అని కూడా తెలుసుకోకుండా పవన్ సినిమా అంటే చాలు ఆలోచించకుండా సంతకం చేస్తుంటారు. పవన్ సినిమా క్రెడిట్ తమ కెరీర్‌కు ప్లస్ అవుతుందనే నమ్మకంతో వారు తీసుకున్న ఈ నిర్ణయాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ జాబితాలో ముందుగా వినిపించే పేరు ఇలియానా. `జల్సా` సినిమా సమయానికి ఇలియానా టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది.
సాధారణంగా స్టార్ హీరోయిన్లు తమ పాత్ర గురించి ఆరా తీస్తారు. కానీ ఇలియానా మాత్రం పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం రాగానే కథ వినకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. మరో క్రేజీ హీరోయిన్ శృతి హాసన్ కెరీర్ ఆరంభంలో వరుస పరాజయాలతో సతమ తమవుతున్న సమయంలో `గబ్బర్ సింగ్` లో నటించే అవకాశం వచ్చింది. అది రీమేక్ సినిమా అయినప్పటికీ? పవన్ కళ్యాణ్ పక్కన నటిస్తే జాతకం మారుతుందని బలంగా నమ్మింది. కథలోని మార్పుల గురించి కూడా ఆలోచించకుండా ప్రాజెక్టులోకి అడుగుపెట్టింది.
ఫలితంగా ఆ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. శృతి హాసన్ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా ఫేమస్ అయింది. వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే నిత్య మీనన్ సైతం పవన్ కళ్యాణ్ విషయంలో తన పంథాని సైతం పెట్టారు. `భీమ్లా నాయక్` లో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. ఒక కమర్షియల్ సినిమాలో అలాంటి చిన్న పాత్రను నిత్య ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేయాలనే కోరికతో ఆమె ఆ పాత్రను స్వీకరించారు. స్క్రీన్‌పై వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు తక్కువైనా? ఉన్నంతలో నిత్య తన నటనతో ఆకట్టుకున్నారు.
అలాగే అను ఇమ్మాన్యుయేల్- సంయుక్త మీనన్ వంటి భామలు కూడా పవన్ కళ్యాణ్ సినిమా అంటే కథతో సంబంధం లేకుండా సైన్ చేసేశారు. `అజ్ఞాతవాసి` వంటి భారీ ప్రాజెక్టులో అను ఇమ్మాన్యుయేల్ నటించగా, `భీమ్లా నాయక్` సంయుక్త మీనన్ కీలక పాత్ర పోషించారు. పవన్ సినిమా ద్వారా వచ్చే గుర్తింపు తమ భవిష్యత్తుకు పునాది గా నిలుస్తుందని భావించారు. అనుకున్నట్లు ఆ ఇద్దరు సక్సెస్ అయ్యారు. తాజాగా `ఉస్తాద్ భగత్ సింగ్` సినిమాలో రాశీఖన్నా కూడా అలాగే కమిట్ అయింది. పవన్ తో సినిమా అనగానే పాత్ర ఎలా ఉంటుంది? అని కూడా తెలుసు కోకుండా కమిట్ అయింది. అలా కొందరు హీరోయిన్ పవర్ స్టార్ బ్రాండ్ తో మార్కెట్ లో పాపులర్ అయ్యారు.
