బాబోయ్.. పవర్ స్టార్ ఫుల్ టైం డ్యూటీ చేస్తే..?
జస్ట్ తనకున్న 3 రోజులు మొత్తం సినిమా ప్రమోషన్స్ కి వాడారు పవన్ కళ్యాణ్. అదేంటో పవర్ స్టార్ 3 డేస్ ప్రమోషన్స్ కే వీరమల్లుకి తారాస్థాయి బజ్ ఏర్పడింది.
By: Tupaki Desk | 24 July 2025 1:03 AM ISTహరి హర వీరమల్లు సినిమాకు పవన్ కళ్యాణ్ ఆన్ డ్యూటీ చేస్తున్నాడు. సినిమా పూర్తి చేయడానికి నాలుగేళ్లు టైం తీసుకున్న పవర్ స్టార్ ఇప్పుడు రిలీజ్ ముందు తన పూర్తి కోపరేషన్ అందిస్తున్నాడు. సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ప్రమోషన్స్ చేయడం ఫ్యాన్స్ కి మస్త్ మజా ఇస్తుంది. పవన్ కళ్యాణ్ ఏ సినిమాకు చేయని క్రెజీ ప్రమోషన్స్ ఈ మూవీకి చేస్తున్నాడు.
వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన సినిమా.. అందుకే తన వల్ల లేట్ అయిన ఈ సినిమాకు తన వల్లే లాభం చేకూరాలని చేశాడు. ట్రైలర్ రిలీజ్ ముందు అంటే నెల రోజులు ముందు వరకు హరి హర వీరమల్లు సినిమా గురించి ఫ్యాన్స్ లో కూడా ఇంట్రెస్ట్ లేదు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత పాజిటివ్ బజ్ దాని తర్వాత ప్రమోషన్స్ ఇవన్నీ యాడ్ అయ్యాయి.
ఇక పవర్ స్టార్ డ్యూటీ ఎక్కాక మాత్రం ఎక్కడ చూసినా హరి హర వీరమల్లు టాపిక్కే వినపడుతుంది. జస్ట్ తనకున్న 3 రోజులు మొత్తం సినిమా ప్రమోషన్స్ కి వాడారు పవన్ కళ్యాణ్. అదేంటో పవర్ స్టార్ 3 డేస్ ప్రమోషన్స్ కే వీరమల్లుకి తారాస్థాయి బజ్ ఏర్పడింది. ఐతే ఆయన పూర్తిస్థాయిలో అదే మిగతా హీరోల్లా సినిమాలే చేస్తూ ఫుల్ టైం ఉంటే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.
చిరంజీవి గురించి ఇప్పటి యూత్ ఆడియన్స్ కి తెలియదు అన్నట్టుగా పవర్ స్టార్ స్టామినా గురించి కూడా నేటి యువతకి తెలియదు. ఆయన సినిమాలు రిలీజ్ లకు ఉండే క్రేజ్.. ఆయన ఫస్ట్ డే కలెక్షన్స్ హంగామా ఇదంతా ఒక హిస్టరీ.. జస్ట్ పవన్ సినిమాల నుంచి దూరంగా ఉన్నాడని ఆయన వల్ల కాదనుకుంటే ఇదిగో ఇలానే తుఫానులా వచ్చి సంచలనాలు సృష్టిస్తాడు.
హరి హర వీరమల్లు సినిమాను పార్ స్టార్ ఇంత పర్సనల్ గా తీసుకోవడానికి మరో రీజన్ సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని కుట్ర జరగడమే అని ఇన్నర్ టాక్. తన సినిమాలను ఆపే సీన్ ఎవరికి లేదని పవర్ స్టార్ తన స్టామినా ఏంటో చూపించాలనే ఇలా క్రేజీ ప్రమోషన్స్ ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమా కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి అయితే ఇది నిజంగానే ఒక పండగ అని చెప్పొచ్చు.
