వోల్ప్ vs వీరమల్లు మతిపోతుందా!
జూన్ 12న రిలీజ్ కావాల్సిన 'హరిహరవీరమల్లు' రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయంలో పూర్తికాకపోవడంతో చిత్రాన్ని వాయిదా వేసారు.
By: Tupaki Desk | 5 Jun 2025 8:52 PM ISTజూన్ 12న రిలీజ్ కావాల్సిన 'హరిహరవీరమల్లు' రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయంలో పూర్తికాకపోవడంతో చిత్రాన్ని వాయిదా వేసారు. భారీ పీరియాడిక్ చిత్రం కావడంతో కంటెంట్ కి సీజీ ఎక్కువగా ఉంది. బ్యాకెండ్ లో టెక్నికల్ టీమ్ రేయింబవళ్లు పనిచేస్తున్నా? పూర్తవ్వలేదు. దీంతో అనూహ్యంగా వాయిదా వేసారు. తాజాగా దీనికి సంబంధించి మరింత వివరణ బయటకు వచ్చింది.
విఎఫ్ ఎక్స్ పనులు జరుగుతున్నాయి. సీజీ వర్క్ ఎక్కువగా ఉంది. యాక్షన్ సన్నివేశాలను వీలైతనం రియల్ స్టిక్ అప్పిరియన్స్ తో ఆస్వాదించాలంటే సీజీ అంతే పర్పెక్ట్ గా ఉండాలి. అందుకోసం టీమ్ నిరంతరం పనిచేస్తోంది. ప్రతీ షాట్ కి సీజీ అసవరం పడుతుందని మేకర్స్ తెలిపారు. అలాగే మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా రివీల్ చేసారు. సినిమాలో ఏడెనిమిది ప్రధానమైన యాక్షన్ సన్నివేశాలున్నాయి.
అన్నీ భారీ కాన్సాస్ పై చిత్రీకరించినవే. ఒక్కో యాక్షన్ సన్నివేశానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ నిచ్చే చిత్రమిదన్నారు. వోల్ప్ వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య ఓ పోరాట సన్నివేశం కూడా ఉందన్నారు. ఈ సన్నివేశం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సీన్ క్లైమాక్స్ లో ఉంటుంది. ఎంతో రియలిస్టిక్ గా ఉంటుందన్నారు. దీంతో ఈ సీన్ ఓ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందని తెలుస్తుంది.
మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా తోడేలుతో సమరానికి దిగారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో హీరోలు జంతువులతో కూడా తలపడుతున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బెంగాల్ టైగర్ నే మట్టి కరిపించాడు. ఇది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్. 'లియో' లో దళపతి విజయ్ కూడా హైనాతో పోరాటం చేస్తాడు. ఈ సీన్ కూడా సినిమాలో హైలైట్ గా ఉంటుంది. ఈసారి పవన్ వంతొచ్చింది.
