తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం
పవన్ కళ్యాణ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల జాబితాలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటాడు.
By: Tupaki Desk | 22 July 2025 4:21 PM ISTపవన్ కళ్యాణ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల జాబితాలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటాడు. పైగా పవన్ ఫ్యాన్స్ యావరేజ్ ఏజ్ 25 ఏళ్ల నుంచి 30 ఏళ్లు అని చెప్పుకోవచ్చు. అందుకే ఆయన సినిమా విడుదల కాబోతుంది అంటే రచ్చ మామూలుగా ఉండదు. ఆయన నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఆయన రాజకీయాల్లో బిజీ కావడం, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం వంటి కారణాల వల్ల సినిమాలు ఆలస్యం అవుతూ వచ్చాయి. నాలుగు.. ఐదు ఏళ్ల క్రితం ప్రారంభం అయిన ఈ సినిమాలను పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యారు.
క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు సినిమా ఆలస్యం కావడంతో దర్శకుడి చేతులు మారింది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తి అయిన ఈ హరిహర వీరమల్లు సినిమాను జులై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మరో రెండు రోజుల్లో సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయ్యాయి. పవన్ ఎప్పుడూ లేనిది ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడూ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియా ముందుకు రాని పవన్ కళ్యాణ్ ఈసారి మీడియాతో మాట్లాడాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా చాలా గట్టిగానే తన వాయిస్‌ను సినిమా గురించి వినిపించారు.
పవన్ మాటలతో రెచ్చి పోయిన ఫ్యాన్స్ ఫస్ట్ డేను ఎంజాయ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లను అలంకరించే పని ఇప్పటికే ప్రారంభం అయ్యింది. క్వింటాల్స్ లో పేపర్స్‌ను థియేటర్‌లలో జల్లేందుకు గాను అభిమానులు ఇప్పటికే కట్టింగ్స్ రెడీగా పెట్టుకున్నారు. అంతే కాకుండా భారీ కటౌట్‌లు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదల కాబోతున్న థియేటర్ల వద్ద పండుగ వాతావరణం ఇప్పటికే ప్రారంభం అయింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు గత రెండు మూడు నెలలుగా మినిమం ప్రేక్షకులు లేక పోవడం వల్ల మెయింటనెన్స్ లేకుండా ఉన్నాయి. ఇప్పుడు వాటి దుమ్ము దులిపేందుకు యాజమాన్యాలు సిద్ధం అవుతున్నాయి.
హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో కుమ్మేయడం ఖాయం అనే విశ్వాసంను పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, అంతకు ముందు ఆయన ప్రెస్‌మీట్‌లో, ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ వీరమల్లు సినిమా గట్టిగా ఆడుతుందనే విశ్వాసం ను వ్యక్తం చేయడం జరిగింది. అందుకే అత్యధిక వసూళ్లు నమోదు అయ్యే విధంగా భారీ ఎత్తున పెయిడ్ ప్రీమియర్‌లను వేయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో టికెట్ల రేట్లు పెంచి పెయిడ్ ప్రీమియర్‌కు అనుమతులు ఇచ్చారని తెలుస్తోంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో ఔరంగజేబు పాత్రలో నటించాడు. సినిమా కు మినిమం పాజిటివ్ టాక్ వచ్చినా ఖచ్చితంగా కలెక్షన్స్ భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
