వీరమల్లు : జనాలు అసూయ పడుతున్నారట!
దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ సర్‌ను డైరెక్ట్ చేయడం చూసి చాలా మంది అసూయ పడుతున్నారు.
By: Tupaki Desk | 7 Jun 2025 2:00 PM ISTపవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా ఈనెలలో విడుదల కావాల్సి ఉన్నా వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఆలస్యం కావడంతో వాయిదా పడ్డ విషయం తెల్సిందే. ఈ నెల చివరి వరకు విడుదల చేయాలని భావించినప్పటికీ అది సాధ్యం కాదని తేలిపోయింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే జులైలో సినిమా విడుదల ఉండే అవకాశం ఉంది. థియేట్రికల్ బిజినెస్ కాలేదు అంటూ పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు కొట్టి పారేశారు. సినిమాకు మంచి స్పందన వస్తుందనే విశ్వాసంను దర్శకుడు జ్యోతికృష్ణ చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ప్రభుత్వం తరపున మంత్రులతో పాటు, పలువురు ఎమ్మెల్యేలు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు సినిమా టీం సైతం అక్కడ సందడి చేశారు. హీరోయిన్ నిధి అగర్వాల్ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఆమె వేసిన స్టెప్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అంతే కాకుండా పలువురు ప్రముఖులు పవన్ కళ్యాణ్ గురించి, ఆ సినిమాల గురించి వ్యాఖ్యలు చేశారు. క్రిష్ హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకోవడంతో జ్యోతికృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను తీసుకున్న విషయం తెల్సిందే. బీచ్ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడుతూ సినిమాపై అంచనాలు పెంచారు.
దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ సర్‌ను డైరెక్ట్ చేయడం చూసి చాలా మంది అసూయ పడుతున్నారు. నాకు పవన్ సర్‌తో కలిసి వర్క్ చేసే అవకాశం రావడంను చూసి చాలా మంది అసూయ పడుతున్న విషయంను నేను గుర్తించాను. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి అవకాశం దక్కదు అనే ఉద్దేశంతో జ్యోతికృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు నాకు అప్పగించిన పనికి పూర్తి న్యాయం చేశాను అని భావిస్తున్నాను. సినిమాను చూసిన తర్వాత పవన్ సర్ నాతో మాట్లాడారు. దాదాపు గంట సమయం నాతో సినిమా గురించి మాట్లాడుతూ ప్రశంసించారు. మరోసారి నాతో కలిసి సినిమా చేయాలని కోరికను ఆయన వ్యక్తం చేశారు. నాకు ఎప్పటికీ ఆయన మాటలు గుర్తుండి పోతాయి.
హరిహర వీరమల్లు సినిమా పీరియాడిక్ డ్రామాగా రూపొందింది. ఈ సినిమాలో పవన్ గతంలో ఎప్పుడూ లేని విధంగా విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, కీలక పాత్రలో బాలీవుడ్ బ్యూటీ నటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి సంగీతాన్ని అందించారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా దాదాపుగా ఈ సినిమా మూడు ఏళ్లు ఆలస్యం అయింది. ఈ మూడు ఏళ్ల ఎదురుచూపులకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది వచ్చే నెలలో విడుదల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
