Begin typing your search above and press return to search.

'ఓజీ' కోసం పవన్‌ షర్ట్‌ లెస్‌...!

ఉప ముఖ్యమంత్రిగా ఏడాది కాలంగా బిజీ బిజీగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు డేట్లు ఇవ్వలేక పోయాడు.

By:  Tupaki Desk   |   25 May 2025 5:00 AM IST
Pawan Kalyan Busy Year Hari Hara Veeramallu & OG Set for Pan-India Releases
X

ఉప ముఖ్యమంత్రిగా ఏడాది కాలంగా బిజీ బిజీగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు డేట్లు ఇవ్వలేక పోయాడు. ఎట్టకేలకు కాస్త సమయం లభిస్తున్న నేపథ్యంలో మధ్యలో ఉన్న సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసేందుకు గాను డేట్లు ఇస్తూ వచ్చాడు. ఇటీవలే హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన విషయం తెల్సిందే. హరి హర వీరమల్లు సినిమాను రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటన చేశారు. అందుకు తగ్గట్లుగా మొదటి పార్ట్‌లో రెండో పార్ట్‌కి సంబంధించిన హింట్‌ ఇచ్చి, ఆసక్తి కలిగించే విధంగా సస్పెన్స్‌ క్రియేట్‌ చేసి ఎండ్‌ కార్డ్‌ వేస్తారని తెలుస్తోంది. ఇక 'ఓజీ' సినిమా షూట్‌ని కూడా పూర్తి చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

హరి హర వీరమల్లు సినిమాను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుండగా, ఓజీ సినిమాను సెప్టెంబర్‌ 25న విడుదల చేస్తారని తెలుస్తోంది. సాహో సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమాలో పవన్‌ కళ్యాన్‌ గ్యాంగ్‌ స్టర్‌ పాత్రలో కనిపించబోతున్నారు. పవన్‌ ఫ్యాన్స్ ఆయన్ను ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో అలాగే ఓజీలో చూడబోతున్నారు. గన్స్‌ అంటే ఇష్టం అని చెబుతూ ఉండే పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమాలో గన్స్‌తో పెద్ద సాహసమే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఓజీ సినిమా చాలా స్టైలిష్‌గా ఉంటుందని, తప్పకుండా ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల వారిని, ముఖ్యంగా బాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.

'ఓజీ' సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే దర్శకుడు సుజీత్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్స్‌తో యాక్షన్‌ కొరియోగ్రఫీ చేయిస్తున్నారని తెలుస్తోంది. యాక్షన్‌ సన్నివేశాల కోసం సుజీత్‌ కాస్త ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారట. ఇక ఈ సినిమాలోని ఒక యాక్షన్‌ సన్నివేశం కోసం పవన్‌ కళ్యాణ్‌ షర్ట్‌ లేకుండా కనిపిస్తాడని తెలుస్తోంది. మధ్య పవన్‌ కళ్యాణ్ ఒక సందర్భంలో షర్ట్‌ విప్పి నీటిలో మునిగిన సమయంలో భారీ ట్రోల్స్ వచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని యాక్షన్‌ సన్నివేశానికి పవన్‌ కళ్యాణ్‌ను షర్ట్‌ లేకుండా చూపించడం సాహసమే అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తూ ఉంటే, ఆ ఫోటోలు మార్ఫింగ్‌ ఫోటోలు అని, అసలైన పవన్‌ను ఓజీ లో షర్ట్‌ లేకుండా చూపిస్తారని కొందరు అంటున్నారు.

సాహో సినిమాలో ప్రభాస్‌ను స్టైలిష్‌గా చూపించడంలో దర్శకుడు సుజీత్‌ సఫలం అయ్యాడు. తెలుగులో సాహో హిట్‌ కాకున్నా హిందీలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఓజీ సినిమా పట్ల పవన్‌ కళ్యాణ్ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే వచ్చిన స్టైలిష్‌ లుక్‌తో పాటు, ఓజీ థీమ్‌ కు మంచి స్పందన వచ్చింది. అందుకే ఎక్కడా రాజీ పడకుండా కాస్త మెల్లగానే ఓజీ సినిమాను పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం నిజంగానే పవన్‌ కళ్యాణ్ షర్ట్‌ లేకుండా కనిపిస్తే కచ్చితంగా సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. పవన్‌ ఆ సాహసం చేస్తాడా.. సుజీత్‌ ఆ ఫీట్‌ దక్కించుకుంటాడా అనేది చూడాలి.