సనాతన ధర్మంతో ప్రచారం స్ట్రాటజీ!
మొఘల సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ సామ్రాజ్యంపై వీరమల్లు పవన్ చేసే పోరాటం ప్రధా నంగా హైలైట్ అవుతుంది.
By: Tupaki Desk | 29 May 2025 5:20 PM ISTసనాతన ధర్మం పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ ఆ మధ్య పెద్ద ఎత్తున ఉద్యమించిన సంగతి తెలిసిందే. తిరుపతి లడ్డు కల్తీ ఆరోపణల్లో భాగంగా పవన్ మాలలోనే తిరుమల మెట్లను శుభ్ర పచడం..వాటికి పసుపు గంధం రాయడంతో? దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ అంశంపై టీవీల్లో...సోషల్ మీడియాల్లో పెద్ద ఎత్తున డిబేట్లు జరిగాయి. జాతీయ మీడియాలో సైతం చర్చనీయాంశంగా మారింది.
ఆ సమయంలో జనసైనుకులు చాలా ప్రాంతాల్లో పరిరక్షణ చర్చలకు దిగారు. దీంతో పవన్ పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపోయింది. తాజాగా ఇదే సనాతన ధర్మం పేరుతో `హరిహరవీరమల్లు` ప్రచారం పనులు మొదలు పెట్టారు. మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ సనాతన ధర్మం గొప్పతనాన్ని వీరమల్లు పాత్ర చాటుతుందని దర్శకుడు జ్యోతికృష్ణ చెప్పారు. దీంతో సనాతని పాయింట్ తో నే జనాన్ని సినిమాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మొదలు పెట్టారన్నది అర్దమవుతుంది.
మొఘల సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ సామ్రాజ్యంపై వీరమల్లు పవన్ చేసే పోరాటం ప్రధా నంగా హైలైట్ అవుతుంది. ఈ కథకి సనాతన ధర్మానికి సంబంధం ఉండటంతో ఈ అంశాన్ని మేకర్స్ ప్రచారం పరంగా కలిసొస్తుందని ఎత్తుకున్నారు. ప్రచారం పనులు మొదలైన నేపథ్యంలో రిలీజ్ అయ్యే వరకూ ప్రచారం పీక్స్ లోనే ఉంటుంది. జూన్ 12 న చిత్రం రిలీజ్ అవుతుంది.
మరి పవన్ సనాతన దర్మం క్రేజ్ జాతీయ స్థాయిలో ఎలా కలిసొస్తుందో చూడాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. హిందుత్వం కాన్సెప్ట్ కి అక్కడ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సౌత్ లో మాత్రం కొన్ని రాష్ట్రాల్లో అందుకు భిన్నమైన సన్నివేశం ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.
