Begin typing your search above and press return to search.

వీరమల్లు రిలీజ్.. పవర్ఫుల్ వార్ పోస్టర్ తో న్యూ డేట్!

ఇక సినిమాను జులై 24న రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఒక బిగ్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆడియెన్స్ కు ఇది పర్ఫెక్ట్ సినిమా అని చెప్పవచ్చు.

By:  Tupaki Desk   |   21 Jun 2025 9:34 AM IST
వీరమల్లు రిలీజ్.. పవర్ఫుల్ వార్ పోస్టర్ తో న్యూ డేట్!
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులకు ఇక ఫుల్‌స్టాప్ పడింది. లాంగ్ డిలే అయిన హరి హర వీరమల్లు చిత్రం ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా జూలైలోనే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది.

తాజాగా విడుదలైన అధికారిక పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ పోరాటానికి సిద్ధంగా కనిపించగా, బాబీ డియోల్ విలన్‌గా అద్భుతమైన ఇంటెన్సిటీతో నిలిచాడు. పోస్టర్‌లో “Part 1 – స్వార్డ్ vs స్పిరిట్: బాటిల్ ఆఫ్ ధర్మ” అనే క్యాప్షన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వీరమల్లు పాత్ర యుద్ధానికి సిద్ధమవుతుండగా, మరోవైపు బాబీ డియోల్ ఆధిపత్యానికి పోరాడుతున్నాడు.

ఇదే విషయాన్ని అధికారికంగా పేర్కొంటూ "ఒకరు అధికారం కోసం పోరాడుతారు. ఒకరు ధర్మం కోసం పోరాడుతారు. వారసత్వాల ఘర్షణ ప్రారంభమవుతుంది." అనే క్యాప్షన్ షేర్ చేశారు. ఇది నెట్టింట్లో ట్రెండింగ్ అయ్యింది. ఇక సినిమాను జులై 24న రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఒక బిగ్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆడియెన్స్ కు ఇది పర్ఫెక్ట్ సినిమా అని చెప్పవచ్చు. పైగా డిప్యూటీ సీఎంగా నిలిచిన తరువాత పవన్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇది.

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇదొక ప్రత్యేక ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీ డియోల్, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ పనులు భారీగా ఉంటాయని సమాచారం. ఈ కారణంగా ఇంత వరకు రిలీజ్ ఆలస్యం అయినట్టు సినీ వర్గాల్లో ప్రచారం.

ఇక ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాకు సంబంధించి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓసారి రిలీజ్ డేట్ లాక్ కావడంతో థియేటర్ ఓనర్లు, ఫ్యాన్స్ ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. ఇంతకాలం ఓ నోటీసు, ఓ గ్లింప్స్ కోసం వెయిట్ చేసిన పవన్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఇదే నిజమైన పండుగ. జూలై 24న ‘వీరమల్లు’ బాక్సాఫీస్‌ను శాసిస్తాడాని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా ఆ అంచనాలను ఏ రేంజ్ లో అందుకుంటుందో చూడాలి.