పవన్ వీరమల్లు చేయడానికి కారణమిదేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తూ తన అభిమానుల్ని అలరిస్తూ వస్తున్నారు.
By: Tupaki Desk | 28 July 2025 3:00 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తూ తన అభిమానుల్ని అలరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే తాను కమిట్ అయిన సినిమాలన్నింటినీ వరుస పెట్టి చేసుకుంటూ వెళ్తున్న పవన్, రీసెంట్ గా హరి హర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
అర్థవంతమైన సినిమాలపై పవన్ ఫోకస్
జులై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా ఫలితాన్ని పక్కన పెడిత పవన్ కళ్యాణ్ అసలెందుకు ఈ సినిమా చేశారనేది ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మంచి కథలనే ఎంచుకుంటారు. అందులోనూ రాజకీయాల్లోకి వద్దామనుకున్నప్పటి నుంచి పవన్ దృష్టంతా అర్థవంతమైన సినిమాల పైనే ఉంది.
హరి హర వీరమల్లు సినిమా కూడా అలాంటి అర్థవంతమైన చిత్రమే. వీరమల్లు సినిమా కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా అందులో ఆడియన్స్ ను ఎడ్యుకేట్ చేసే సబ్జెక్ట్ కూడా ఉంది. ఇండియన్ హిస్టరీలో, సనాతన ధర్మంలో పెద్దగా చర్చకు రాని పాయింట్ ను వీరమల్లు లో బాగా హైలైట్ చేశారు. అదే జిజియా పన్ను భారం.
16వ శతాబ్ధపు బ్యాక్ డ్రాప్ కు వ్యతిరేకంగా రూపొందించబడిన వీరమల్లు సినిమా లో మొఘలుల పాలనలో మరీ ముఖ్యంగా ఔరంగజేబు రూలింగ్ లో ఉన్న సామాజిక వాతావరణాన్ని ఈ సినిమా కళ్లకు కట్టినట్టు చూపించింది. వీరమల్లులో హిందువులు ఎదుర్కొంటున్న అన్యాయాలు, జిజియా పన్ను గురించి ఎంతో బాగా చూపించడంతో పాటూ ఆ అంశాలను బాగా హైలైట్ కూడా చేశారు.
యాక్షన్ సీక్వెన్స్ కు కొరియోగ్రఫీ కూడా..
కేవలం 16వ శతాబ్దం నేపథ్యంలో సినిమాను తీయడమే కాకుండా సినిమాలో పెద్ద పెద్ద ప్యాలెస్‌ల నుంచి ఆనాటి సాంప్రదాయ దుస్తుల విషయం వరకు ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. సినిమాలో వీరమల్లుగా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా సినిమాలో ఎంతో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ కు కొరియోగ్రఫీ చేసే బాధ్యతను కూడా తీసుకున్న పవన్ కళ్యాణ్, అక్కడితో ఆగకుండా పొలిటికల్ లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా సినిమా ప్రమోషన్స్ లో కూడా భాగమయ్యారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ తరానికి పాత కాలపు వాస్తవాల గురించి అవగాహన పెంచడమే టార్గెట్ గా పవన్ వీరమల్లును చేసినట్టనిపిస్తోంది.
ఎప్పుడో కరోనాకు ముందు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంది. మధ్యలో కొన్ని కారణాల వల్ల క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఏఎం జ్యోతి కృష్ణ ఆ బాధ్యతల్ని తీసుకుని సినిమాను పూర్తి చేశారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబుగా నటించగా కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు.
