Begin typing your search above and press return to search.

డ్రమ్ము గుద్ది చెబుతున్న ఫ్యాన్స్ కి పండగే..!

కీరవాణి హైదరాబాద్ ఈవెంట్ లో కంపోజ్ చేసిన పవర్ స్టార్ ప్రత్యేకమైన సాంగ్ ని ఈ ఈవెంట్ లో కూడా ప్లే చేశారు.

By:  Tupaki Desk   |   23 July 2025 7:00 PM IST
డ్రమ్ము గుద్ది చెబుతున్న ఫ్యాన్స్ కి పండగే..!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా కొద్ది గంటల్లో ప్రీమియర్స్ మొదలవుతున్నా కూడా సినిమాను ఇంకా ప్రమోట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. క్రిష్ మొదలు పెట్టిన ఈ సినిమాను జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. జూలై 24 అంటే రేపు గురువారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు 500 స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు నిర్మాతలు.

ఈ క్రమంలో నేడు రాత్రి 9 గంటలకే ఆ షోస్ పడనున్నాయి. ఇదిలాఉంటే నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ అండ్ టీం లేటెస్ట్ గా హరి హర వీరమల్లు ఈవెంట్ ని వైజాగ్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తో పాటు మిగతా చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

వీరమల్లు వైజాగ్ ఈవెంట్ లో మరోసారి ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. ఆయన స్టేజ్ మీదకు డ్రమ్ముని తెప్పించి వీర వీర సాంగ్ ని పాడి వినిపించారు. అంతేకాదు పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ ఇది కచ్చితంగా ఫీస్ట్ అందిస్తుందని అన్నారు. ఎవరైనా సినిమా గురించి బల్ల గుద్ది చెబుతారు కానీ తాను మాత్రం డ్రమ్ము గుద్ది చెబుతానని మీ అందరికీ పండగే అని అన్నారు కీరవాణి.

కీరవాణి హైదరాబాద్ ఈవెంట్ లో కంపోజ్ చేసిన పవర్ స్టార్ ప్రత్యేకమైన సాంగ్ ని ఈ ఈవెంట్ లో కూడా ప్లే చేశారు. హరి హర వీరమల్లు సినిమాకు కీరవాణి మ్యూజిక్ కూడా హైలెట్ అయ్యేలా ఉంది. సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రతి దానిలో కీరవాణి మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. తెర మీద పవన్ కళ్యాణ్ విధ్వంసానికి తెర వెనక కీరవాణి పూనకాలు తెప్పించే మ్యూజిక్ కూడా తోడయ్యేలా ఉందని అర్ధమవుతుంది.

పవర్ స్టార్ హరి హర వీరమల్లు ఇన్నేళ్లు ఆపిన దానికి రిలీజ్ టైం లో తన టైం ని పూర్తిగా సినిమా ప్రమోషన్స్ కి కేటాయించారు పవర్ స్టార్. ఏ విషయమైన ఆయన డ్యూటీ ఎక్కితే ఎలా ఉంటుందో వీరమల్లు హంగామా చూస్తే అర్ధమవుతుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్ ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. మరి ఈ సినిమా అంచనాలను అందుకునేలా ఉంటుందా లేదా అన్నది చూద్దాం.