హరిహర వీరమల్లు: ఓ పనైపోయింది.. కానీ..
అయితే ఇదే సమయంలో మరో షాకింగ్ అప్డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 22 April 2025 7:03 AMపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ హరి హర వీర మల్లు పై గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో ఊహాగానాలు, వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి. మొదట క్రిష్ జగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు జ్యోతికృష్ణ చేతుల్లో ఉంది. కానీ మొదటి భాగం ఎప్పుడు విడుదల అవుతుందో స్పష్టత లేకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది.
ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ ఇటీవల హరి హర వీర మల్లుకు సమయం కేటాయించి మిగిలిన డబ్బింగ్ పార్ట్‌ని పూర్తి చేశారని వార్తలు వచ్చాయి. దీంతో మొదటి భాగం అయిన స్వార్డ్ vs స్పిరిట్ త్వరలో థియేటర్లలోకి వస్తుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదే సమయంలో మరో షాకింగ్ అప్డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది.
సెట్స్ దగ్గర పని చేస్తున్న కాస్ట్యూమ్ డిజైనర్లు షేర్ చేసిన సోషల్ మీడియా పోస్టుల ప్రకారం.. షూటింగ్ కీలక షెడ్యూల్ పూర్తయిందట. అయితే అది మొదటి పార్ట్‌ది కాదు, రెండో పార్ట్‌కి సంబంధించినది. ముంబైలో జరిగిన అవుట్‌డోర్ షెడ్యూల్‌తో హరిహర వీరమల్లు 2 కు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అంటే, రెండో భాగం పనులు ముందే జరుగుతుండగా, మొదటి భాగం ఇంకా రిలీజ్‌కు సిద్ధంగా లేదన్నది అసలు విషయం. మేకర్స్ సమయం వృధా చేయకుండా సెకండ్ పార్ట్ షూటింగ్ పనులను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నారట.
దీంతో ఫ్యాన్స్ పలు ప్రశ్నలు వేస్తున్నారు. ముందుగా పార్ట్ 1 ఎప్పటికి పూర్తవుతుంది? సినిమా రిలీజ్ అయ్యేదెప్పుడు. ఏదైనా క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. దర్శక నిర్మాతలు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన విడుదల తేదీని ప్రకటించలేదు. ఈ విషయంలో కొనసాగుతున్న గందరగోళం పవన్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది.
ఇక నటీనటుల విషయానికొస్తే నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహీ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి ఆస్కార్ అవార్డ్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, సెట్టింగులు, గ్రాండ్ యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాకు హైలైట్స్ అవుతాయని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటికే వాయిదాలు మించి పోయిన ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక్క అధికారిక విడుదల తేదీ కూడా రాకపోవడం, రెండు పార్ట్‌ల మధ్య స్పష్టత లేకపోవడం వల్ల పవన్ అభిమానులంతా మిగిలిన సమ్మర్ సీజన్ లో అయినా ఫస్ట్ పార్ట్ వస్తుందా? అనే డౌట్ తో ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు పార్ట్ 2 షూటింగ్ పూర్తి అవుతోందంటే, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇకపోతే అధికారిక క్లారిటీతో మేకర్స్ త్వరగా వస్తేనే ఈ హైప్‌ను సాకారంగా మార్చడం సాధ్యమవుతుంది.