వీరమల్లు కోసం కీరవాణి హై వోల్టేజ్ సర్ ప్రైజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ఇంకా సరైన సాలీడ్ హైప్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
By: Tupaki Desk | 15 May 2025 3:30 PMపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ఇంకా సరైన సాలీడ్ హైప్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రిష్ జాగర్లమూడి మొదలైన ఈ సినిమా జ్యోతిక్రిష్ణ డైరెక్షన్లో ముగుస్తోంది. ఇక సూర్య మూవీస్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా, మొఘల్ చక్రవర్తుల నేపథ్యంలో ఓ యోధుడి కథను చెప్పనుంది. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా ఎన్నోసార్లు వాయిదా పడినప్పటికీ, ఇప్పుడు జూన్ 13 విడుదలకు సిద్ధమవుతోంది.
‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి తాజాగా ఓ ఎలివేషన్ సాంగ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. “ప్రళయకాల రుద్రుడల్లే...” అనే లిరిక్‌తో మొదలయ్యే ఈ పాట సినిమాకే హైలైట్ అవుతుందని టాక్ నడుస్తోంది. ఈ సాంగ్‌ను ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి స్వయంగా పాడటం విశేషం. రాంబాబు గోసాల రాసిన సూపర్ లిరిక్స్‌తో ఈ పాట, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేలా ఉంటుందని అంటున్నారు.
ఈ పాట త్వరలో విడుదల కానుందని, ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన సినిమాలు ఎప్పుడూ కూడా ఆడియన్స్‌కు మరపురాని అనుభూతిని అందిస్తాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల్లో ఆయన సంగీతం సినిమాకు ఎంతో బలాన్ని చేకూర్చింది. ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’లోనూ ఆయన సంగీతం సినిమా స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్తుందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఈ పాట సినిమా ట్రైలర్‌తో పాటు విడుదలైతే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని ఆశిస్తున్నారు. ఇక ‘హరిహర వీరమల్లు’ సినిమా నైజాం రైట్స్‌ను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుగుతుండగా, నైజాం ఏరియాలో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉందని టాక్.
ఈ సినిమా కథ 17వ శతాబ్దంలో మొఘల్ రాజుల కాలంలో సాగుతుందని, పవన్ కళ్యాణ్ ఓ ధైర్యవంతుడైన యోధుడి పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో బాబీ సింహా, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా భారీ స్థాయిలో ఉంటాయని, ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లో మరో రికార్డ్ గా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.