Begin typing your search above and press return to search.

సీఎంతో మీటింగ్.. లాస్ట్ లో క్యాన్సిల్.. దిల్ రాజు ఏమన్నారంటే?

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రీసెంట్ గా టాలీవుడ్ సినీ ప్రతినిధులపై ఫైర్ అయిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Jun 2025 5:18 AM
సీఎంతో మీటింగ్.. లాస్ట్ లో క్యాన్సిల్.. దిల్ రాజు ఏమన్నారంటే?
X

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రీసెంట్ గా టాలీవుడ్ సినీ ప్రతినిధులపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడాది గడిచినా వచ్చి ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు నాయుడు కలవకపోవడంపై మండిపడ్డారు. తమకు ఇచ్చిన రిటర్న్ గిప్ట్ ను తగిన విధంగా తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ తర్వాత టాలీవుడ్ పెద్దలు సీఎం చంద్రబాబును కలవడానికి సిద్ధమయ్యారు. ఏపీ ప్రభుత్వం నుంచి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పలువురికి ఫోన్స్ చేసి మీటింగ్ కు ఆహ్వానించారు. జూన్ 15వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశం జరగనున్నట్లు ఫిక్స్ చేశారు. కానీ ఆ తర్వాత వాయిదా వేశారు.

మీటింగ్ కు రావాల్సిన వారిలో ఎక్కువ మంది షూటింగ్స్ వల్ల ఇతర ప్రాంతాల్లో ఉండడంతో సమావేశం వాయిదా వేసినట్టు సినీ వర్గాల సమాచారం. ఆ తర్వాత కొత్త తేదీని ఇప్పటి వరకు ఫిక్స్ చేయలేదు. అయితే పవన్ ఆగ్రహం, సమావేశం ఏర్పాటు, చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయడం వంటి విషయాలపై నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

"డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ వచ్చింది. ఇండస్ట్రీ అంతా ఉలిక్కిపడింది. తెలంగాణలో గద్దర్ అవార్డుల వేడుక తర్వాత రోజు అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. కానీ పొద్దున్న లేచి చూస్తే షూటింగ్స్ వల్ల ఇప్పుడు కలవడం లేదు అన్నారు. అప్పుడు ఇదేంటి.. కరెక్ట్ కాదు అనిపించింది. ఎవరో ఒకరు వ్యక్తపరిచాలి కదా" అని అన్నారు.

"సీఎం గారిని ఏడాది అయింది కలవలేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరో నుంచి నోట్ వచ్చింది.. గౌరవించాలి. షూటింగ్స్ ఆపుకుని వెళ్లాలి. ఫ్యూచర్ లో అక్కడ అవార్డులు ఉంటాయి. ప్రభుత్వాలతో స్నేహ భావం ఉండాలి. షూటింగ్స్ ఆపుకుని అంతా వెళ్లాలి. ఇండస్ట్రీకి ఏం కావాలని డిప్యూటీ సీఎం అడిగారు.. అలా హెల్దీ రిలేషన్ ఉంది" అని దిల్ రాజు తెలిపారు.

"గద్దర్ అవార్డులకు నాలుగు రోజుల ముందు ఫిక్స్ అయింది. అందరూ అందుబాటులో లేరని క్యాన్సిల్ చేశారు. ఏదైనా సమావేశానికి ముందు ఛాంబర్ కు చెబుతారు. మినిస్టర్ దుర్గేష్ గారు అందరికీ కాల్ చేశారు. అది చాలా ఇంపార్టెంట్. పిలుపు రాని వాళ్ళు పక్కన పెడితే.. పిలుపు వచ్చిన వాళ్లు కూడా వెళ్లలేదు. అదే ఇక్కడ పాయింట్" అని అన్నారు.

"సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఎవరు ఉంటారో.. ఎవరు నటిస్తున్నారో.. డైరెక్ట్ చేస్తున్నారో.. నిర్మిస్తున్నారో.. ప్రభావితమైన వ్యక్తులకు ఎవరైనా పిలుస్తారు. ఛాంబర్ లో మీటింగ్ ఉంది. అప్పుడు మీటింగ్ కు కొత్త తేదీపై చర్చిస్తాం. వివిధ ఛాంబర్స్ సినీ ఇండస్ట్రీకి ముఖ్యం. వాటికే ప్రాధాన్యం. కానీ కళ్యాణ్ గారు అన్నట్టు అన్నీ ఛాంబర్స్ ద్వారా వెళ్లాలంటే కష్టం. అవసరానికి, సమస్యకు తేడా ఉంటుంది" అని దిల్ రాజు తెలిపారు.