పవన్ కు పోటీగా అల్లు మూవీ?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 15 July 2025 9:37 AM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఆ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన చిత్రం.. ఇప్పుడు జులై 24వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వనుంది.
దీంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. స్పెషల్ ప్లాన్ వేస్తున్నారట. ఇప్పటికే టీజర్ తో ఆడియన్స్ తో పాటు సినీ ప్రియుల్లో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్.. వాటిని ఇంకా పెంచాలని చూస్తున్నారు. ఔరంగజేబ్ నాటి చరిత్ర ఆధారంగా చేసుకుని సినిమా తెరకెక్కినట్లు ఇప్పటికే అర్థమవుతోంది.
బందిపోటు వీరమల్లుగా పవన్ కళ్యాణ్ కనిపిస్తారని తెలుస్తోంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కాంపౌండ్ నుంచి వస్తున్న తొలి సినిమా హరిహర వీరమల్లు మంచి హిట్ అవ్వాలని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమాకు పోటీగా మరో మూవీ రిలీజ్ కానుంది. అది కూడా డబ్బింగ్ చిత్రం కావడం గమనార్హం.
వీరమల్లు వచ్చిన ఒకరోజు తర్వాత థియేటర్స్ లో సందడి చేయనుండగా.. దాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు. కన్నడ బడా ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్స్మ్ నిర్మించిన మహావతార్ నరసింహ చిత్రాన్ని ఆయన తెలుగులో విడుదల చేస్తున్నారు. అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకువస్తోంది.
యానిమేషన్ ప్రధానంగా రూపొందిన మహావతార్ నరసింహ.. విష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహ అవతారం ఆధారంగా తెరకెక్కుతోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఆ ప్రాజెక్ట్.. యానిమేషన్ మూవీగానే రూపొందుతోంది. త్రీడీ వెర్షన్ లో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో సందడి చేయనుంది.
అయితే పవన్ హరిహర వీరమల్లుకు పోటీగా రిలీజ్ అవ్వడం గమనార్హం. అది కూడా అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది.. మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య ఈ క్లాష్ ఎలాంటి వాతావరణం క్రియేట్ చేస్తుందో అనేలా మరికొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి.
దీంతో ఇప్పుడు మెగా హీరో పవన్ నటిస్తున్న సినిమాకు పోటీగా అల్లు అరవింద్ డబ్బింగ్ మూవీ రిలీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే హోంబలే ఫిల్మ్స్ కాంపౌండ్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కాంతారను అప్పుడు తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఓ రేంజ్ లో ఆ సినిమా తెలుగులో ఆకట్టుకుంది.
భారీ హిట్ గా నిలవడమే కాకుండా.. వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో హోంబలే వాళ్లు నిర్మించిన మహావతార్ నరసింహను అందుకే ఇప్పుడు అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారేమో. అయితే ఆయన వేరే సినిమాల విడుదల సమయంలో తీసుకొస్తే ఎలాంటి విశేషం ఉండేది కాదు. కానీ మెగా హీరో సినిమా టైమ్ లో రిలీజ్ చేస్తుండడంతో అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. మరి ఏ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
