500 సార్లు వినే టైమ్ ఉందా పవన్ జీ!
పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉంటారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చూసుకుంటూ సినిమాలకు కేటాయించాల్సి వస్తోంది.
By: Tupaki Desk | 7 Jun 2025 7:00 PM ISTపవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉంటారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చూసుకుంటూ సినిమాలకు కేటాయించాల్సి వస్తోంది. సినిమాలకంటే ప్రజ సేవా ముఖ్యంగా కాబట్టి అక్కడే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఆయన బిజీ షెడ్యూల్ కారణంగానే ఏడాదిన్నర రెండేళ్లలో పూర్తి కావాల్సిన `హరిహరవీరమల్లు` ఐదేళ్లు పట్టింది. వీరమల్లు కంటే ముందే రిలీజ్ అవ్వాల్సిన `ఓజీ` ఇంకా షూటింగ్ దశలో ఉంది.
మధ్యలో వదిలేసిన `ఉస్తాద్ భగత్ సింగ్` కి తిరిగి మళ్లీ డేట్లు ఈ మధ్యనే కేటాయించారు. ఇతర ప్రాంతా లకు వెళ్లడం వీలు పడని నేపథ్యంలో తాడేపల్లి సమీపంలో సినిమా సెట్లు వేసుకుని షూటింగ్ పూర్తి చేయాల్సిన పరిస్థితులు పవన్ కు ఎదురయ్యాయి. అంటే ఆయన ఎంత బిజీగా ఉన్నారు? అన్నది అర్దం చేసుకోవచ్చు. ఇక ఆయన నటించిన సినిమాలు ఆయనే చూడరు. అంత ఆసక్తి కూడా ఉండదని ఎప్పుడూ చెబుతుంటారు.
నటించి వెళ్లిపోవడం తప్ప ఆ తర్వాత ఏ సినిమా గురించి తాను పెద్దగా పట్టించుకోనని చాలాసార్లు చెప్పారు. అలాంటి పవన్ కళ్యాణ్ వీరమల్లులో ఓ పాటను ఏకంగా 500 సార్లు విన్నారని దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. మరి 500 సార్లు వినేంత సమయం పవన్ కళ్యాణ్ కు ఉందా? అన్నది ఆయనే చెప్పాలి. నిజంగా పవన్ 500సార్లు వింటే గనుక వీరమల్లు టీమ్ అదృష్టవంతులే.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్నా? పవన్ డేట్లు ఇవ్వకపోవడంతో ఇంతకాలం డిలే అయింది. తిరిగి సెట్స్ కి వెళ్లిన తర్వాత పవన్ అదనంగా డేట్లు ఇవ్వాల్సి వస్తోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే `ఉస్తాద్ భగత్ సింగ్` పట్టా లెక్కుతుంది. అందుకు అన్ని ఏర్పాట్లు దర్శకుడు హరీష్ శంకర్ సిద్దం చేస్తున్నాడు.
