Begin typing your search above and press return to search.

మీడియాకు పవన్ అందుకే దూరమా?

ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ హరిహర వీరమల్లు విషయంలో భిన్నంగా ఉంటున్నారు. సోమవారం మేకర్స్ నిర్వహించిన గ్రాండ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   22 July 2025 8:38 AM IST
మీడియాకు పవన్ అందుకే దూరమా?
X

ఏ సినిమాకు అయినా ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కాబట్టి హీరోలంతా తమ సినిమాను కచ్చితంగా ప్రమోట్ చేయాల్సిందే అన్న పరిస్థితి ఏర్పడింది. రిలీజ్ కు ముందు బజ్ క్రియేట్ చేయడంలో ప్రమోషన్స్ దే కీలక పాత్ర. అందుకే హీరోలు ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తుంటారు.

కానీ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వాటన్నింటికీ ఆమడ దూరంలో ఉంటారు. తాను నటించిన సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మాత్రమే కనిపిస్తారు. ఒకప్పుడు ఆడియో రిలీజ్ ఈవెంట్స్ అయ్యేవి కనుక వాటికి వచ్చి సందడి చేసేవారు. కానీ చిత్రాల కోసం మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, మీడియాతో మాట్లాడడం చాలా అరుదుగా జరిగి ఉంటుంది.

ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ హరిహర వీరమల్లు విషయంలో భిన్నంగా ఉంటున్నారు. సోమవారం మేకర్స్ నిర్వహించిన గ్రాండ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తానని కూడా తెలిపారు. అయితే ప్రెస్ మీట్ కు వచ్చింది మాత్రం.. నిర్మాత ఏ ఎం రత్నం కోసమేనని చెప్పారు.

ఒక్కోసారి మూవీ, సక్సెస్ కోసం కాదని.. ఇండస్ట్రీని నిలబట్టే వారి కోసం అండగా నిలబడాలని పవన్ తెలిపారు. వీరమల్లు విషయంలో రత్నం గారు నలిగిపోయారని.. అది తనకు బాధ అనిపించిందని చెప్పారు. అందుకే ఆయన కోసమే ఇప్పుడు ప్రెస్ మీట్ కు వచ్చానని పేర్కొన్నారు. అదే సమయంలో తాను ఎందుకు సినిమాల పరంగా మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నానో చెప్పారు.

ఒకప్పుడు జ్యోతి చిత్ర, సితార వంటి మ్యాగజైన్లలో తన పిక్ వేసే వారు కాదని పవన్ తెలిపారు. సేలబిలిటీ ఉన్న హీరో కాదని పక్కన పెట్టేవారని చెప్పారు. అలా మీడియాకు దూరంగా ఉంటానని పేర్కొన్నారు. అయినా తన సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో తెలియదని, ఏం మాట్లాడాలో కూడా తెలియదని అన్నారు.

సినిమా కోసం అంత చేశాం.. ఇంత చేశాం అని చెప్పుకోవడానికి ఎబ్బెట్టుగా ఉంటుందని పవన్ అన్నారు. చాలా మొహమాటంగా ఉంటుందని తెలిపారు. మీడియాతో మాట్లాడటానికి తనకు అహంకారం కాదని, సినిమా గురించి చెప్పుకోవడం నచ్చదని చెప్పారు. పొలిటికల్ గా మాట్లాడానని, కానీ సినిమా పరంగా ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పారు.