Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ స్టార్ కోరిక తెర‌పై అలా క‌నిపించాలి!

అవును నిజ జీవితంలో తాను ఎలా ఉంటానో...అలాంటి పాత్ర తెర‌పై క‌నిపించాల‌న్నాడు. అలా క‌నిపిం చ‌డం త‌న కోరిక‌గా చెప్పుకొచ్చారు.

By:  Tupaki Desk   |   23 Jun 2025 12:00 AM IST
ప‌వ‌ర్ స్టార్ కోరిక తెర‌పై అలా క‌నిపించాలి!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ 27-28 సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. వాటిలో ర‌క‌ర‌కాల పాత్ర‌లు పోషించారు. కెరీర్ ఆరంభంలో ల‌వ‌ర్ బోయ్ గా క‌నిపించాడు. అవారా పాత్రలు పోషిం చాడు. భ‌గ్న ప్రేమికుడి పాత్ర‌లు పోషించాడు. గ్యాంగ్ స్ట‌ర్ రోల్స్ పోషించాడు. ఇలా క‌థ‌ను..పాత్ర‌ను బ‌ట్టి మౌల్డ్ అయి న‌టించాడు. అయితే ఈ పాత్ర‌లేవి ప‌వ‌న్ కు పూర్తి స్థాయి సంతృప్తినివ్వ‌లేద‌ని తాజాగా ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ తాను పోషించిన ఏ పాత్ర త‌న మ‌న‌సుకు మాత్రం ద‌గ్గ‌ర కాలేద‌న్నారు. పోషించిన‌ ప్ర‌తీ పాత్ర‌లోనూ కొన్ని అంశాలు మాత్ర‌మే న‌చ్చాయి. అవి నచ్చ‌డంతో చేసిన పాత్ర‌లు త‌ప్ప మ‌రో కార‌ణం లేద‌న్నారు. మ‌రి ప‌వ‌న్ ఎలాంటి పాత్ర పోషించాలి అనుకుంటున్నారు? త‌న మ‌న‌సుకు న‌చ్చే పాత్ర ఏది? అంటే సింపుల్ గా ఆయ‌న బ‌యోపిక్ అన్న‌ట్లే మాట్లాడారు.

అవును నిజ జీవితంలో తాను ఎలా ఉంటానో...అలాంటి పాత్ర తెర‌పై క‌నిపించాల‌న్నాడు. అలా క‌నిపిం చ‌డం త‌న కోరిక‌గా చెప్పుకొచ్చారు. కానీ అది సినిమాల్లో కుద‌ర‌కోవ‌చ్చు అని కూడా అన్నారు. అలాంటి సినిమాకు జ‌నాద‌ర‌ణ ల‌భించ‌దేమో అన్నారు. మ‌రి చివ‌ర్లో ఈ మాట ప‌వ‌న్ ఎందుకు అన్న‌ట్లు అంటే? అందుకు ర‌క‌ర‌కాల అంశాలు కార‌ణాలుగా ఉండొచ్చు. అయితే ప‌వ‌న్ జీవితాన్ని అతి ద‌గ్గ‌ర‌గా చూసింది ఇద్ద‌రే వ్య‌క్తులు.

ఒక‌రు అత‌డి ప్రాణ స్నేహితుడు ఆనంద్ సాయి. మ‌రోకరు ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌ర్వాత స్నేహితుడైన త్రివిక్రమ్. ప‌వ‌న్ ఎలా ఉంటాడు? అన్న‌ది వీళ్లిద్ద‌రికీ తెలిసినంత‌గా ఇంకెవ‌రికీ తెలియ‌దు. ప‌వ‌న్ కుటుంబ స‌భ్యుల‌ను మ‌నిహాయిస్తే. ప‌వ‌న్ నిజ జీవితంపై క‌థ రాయ‌ల‌న్నా? పుస్త‌కం రాయాల‌న్నా? అది త్రివిక్ర‌మ్ చేసే అవ‌కాశం ఉంది. ప‌వ‌న్ ఒకే చెబితే బ‌యోపిక్ తీయ‌డానికి గురూజీ రెడీ.