Begin typing your search above and press return to search.

అంజనాదేవి ఆరోగ్యం.. అప్డేట్ ఇచ్చిన పవన్..

అలా సోషల్ మీడియాలో ఎప్పుడూ కనిపిస్తుంటారు. అయితే కొద్ది రోజుల క్రితం అంజనా దేవి ఆరోగ్యం బాగోలేదని నెట్టింట వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   23 July 2025 3:55 PM IST
అంజనాదేవి ఆరోగ్యం.. అప్డేట్ ఇచ్చిన పవన్..
X

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తల్లిగా అంజనాదేవి అందరికీ సుపరిచితమే. ఆమెకు సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. వరుసకు మనవరాలు అయ్యే మెగా కోడలు ఉపాసన.. తన అత్తమ్మాస్ కిచెన్ బిజినెస్ లో భాగంగా అంజనా దేవి మాట్లాడిన వీడియోస్ షేర్ చేస్తుంటారు.

అలా సోషల్ మీడియాలో ఎప్పుడూ కనిపిస్తుంటారు. అయితే కొద్ది రోజుల క్రితం అంజనా దేవి ఆరోగ్యం బాగోలేదని నెట్టింట వార్తలు వచ్చాయి. ఆమెను ఆస్పత్రిలో చేర్చారని.. పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశం రద్దు చేసుకున్నారని.. చిరంజీవి తన షూటింగ్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి.

దీంతో ఒక్కసారిగా మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలో మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు. అంజనాదేవి ఆరోగ్యం బాగానే ఉందని పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. అసత్య ప్రచారాలు నమ్మొదని తెలిపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కానీ ఇప్పుడు పవన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా.. వివిధ మీడియాలకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా క్యాబినెట్ మీటింగ్ కు హాజరు కాకపోవడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

తాను రెండుసార్లు క్యాబినెట్ మీటింగ్ కు హాజరు కాలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఒకసారి తనకు హెల్త్ బాలేకపోవడం వల్ల హాజరు కాలేదని చెప్పారు. మరోసారి కొద్దిరోజుల క్రితం అమ్మకు బాగా లేకపోవడంతోనే క్యాబినెట్ మీటింగ్ లో పాల్గొనలేదని వెల్లడించారు. తల్లి ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని తమ మనోభావాలకు వ్యతిరేకంగా అప్పుడు అందరికీ చెప్పదలచుకోలేదని అన్నారు.

కానీ అమ్మ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారని పవన్ చెప్పారు. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్నారని తెలిపారు. తన తల్లి ఆరోగ్యం గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు తర్వాత మెగా అభిమానులు మళ్ళీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అంజనా దేవికి ఐదుగురు సంతానం. 70 ఏళ్ల వయసున్న అంజనా దేవి ప్రస్తుతం వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.