Begin typing your search above and press return to search.

నాన్నతో అకిరా.. కిర్రాక్ లుక్!

ఈ సందర్భంగా ఆలయ దర్శనాల సమయంలో అకిరా తండ్రితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించాడు.

By:  Tupaki Desk   |   12 Feb 2025 2:57 PM IST
నాన్నతో అకిరా.. కిర్రాక్ లుక్!
X

పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే వ్యక్తి. కానీ ఎప్పుడైనా తన తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి కనిపిస్తే, ఆ ఫోటోలు, వీడియోలు వెంటనే వైరల్ అవుతాయి. ఇటీవల ఏపీ ఎన్నికల అనంతరం అకిరా ఎక్కువగా పవన్ తో కలిసి కనిపిస్తున్నాడు. జనసేన విజయంతో అకిరా తన తండ్రితో మరింత క్లోజ్ అయినట్లు అనిపిస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ దక్షిణాది పర్యటనలో అకిరా కూడా ఆయనతో పాటు వెళ్లాడు.


ఈ సందర్భంగా ఆలయ దర్శనాల సమయంలో అకిరా తండ్రితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. తాజాగా కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ పూజల సమయంలో పవన్ కుమారుడు అకిరా కూడా తన తండ్రితోపాటు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ యాత్ర చేపడతానని ప్రకటించిన విషయం తెలిసిందే.

అకిరా కూడా తండ్రికి తోడుగా మౌనంగా పూజలు నిర్వహించడం పవన్ అభిమానులను ఆనందింపజేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ సారి అకిరా లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గడ్డం పెంచి, ఒప్పుగా స్టైలిష్‌గా తయారైన అకిరా తెల్లటి కుర్తా, ట్రెడిషనల్ లుక్‌లో కనిపించాడు. పవన్ ఫ్యాన్స్ ఆయన్ను చూస్తే తండ్రికి తగ్గ కొడుకు అని అనిపిస్తోంది.

అకిరా మునుపటి ఫోటోలతో పోలిస్తే ఇప్పుడు మరింత మ్యాచ్యూర్డ్ లుక్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పవన్ తో ఎక్కువగా కనిపిస్తున్న అకిరా త్వరలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడా అనే చర్చలు కూడా సాగుతున్నాయి. అకిరా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడా అనే విషయంలో తల్లి రేణు దేశాయ్ సరైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. అతనికి సంగీతం ఇష్టమని, హీరోగా రావడం రాకపోవడం ఇప్పుడే తేల్చలేని విషయమని డౌట్స్ క్రియేట్ చేశారు. ఇక ఆమె అలా వ్యాఖ్యానించినప్పటికీ, అకిరా లేటెస్ట్ లుక్ చూసిన తర్వాత ఫ్యాన్స్ మాత్రం మరోలా ఆలోచిస్తున్నారు.

అకిరా తన తండ్రి పవన్ కళ్యాణ్ లాగే డాషింగ్ లుక్ లో కనిపించడం, అందులోనూ పవన్ స్టైల్ ఫాలో అవుతుండటం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో అకిరా ఫోటోలను చూసి ‘అకిరా కూడా హీరో అవుతాడు!’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఆలయ దర్శనాలు కొనసాగుతుండగా, అకిరా కూడా ఈ యాత్రలో తండ్రికి మద్దతుగా కనిపించడం మరింత ప్రత్యేకంగా మారింది. అకిరా తన కెరీర్‌ను ఏ దిశగా తీసుకెళ్లాలని అనుకుంటున్నాడో తెలియాల్సి ఉంది. అయితే అతని లేటెస్ట్ లుక్ చూసిన అభిమానులు మాత్రం త్వరలోనే ఏదో ఒక సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.