Begin typing your search above and press return to search.

ఆమెను చూసి సిగ్గు తెచ్చుకున్నాను: పవన్ కళ్యాన్

కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘హరి హర వీరమల్లు’ సినిమా ద్వారా మళ్లీ తెలుగు ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది.

By:  Tupaki Desk   |   22 July 2025 12:38 PM IST
ఆమెను చూసి సిగ్గు తెచ్చుకున్నాను: పవన్ కళ్యాన్
X

తెలుగు ప్రేక్షకులకు సవ్యసాచి సినిమాతో పరిచయమైన నిధి అగర్వాల్, తన ఎనర్జిటిక్ ప్రెజెన్స్‌తో తక్కువ కాలంలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్‌గా ఎదిగింది. ‘మిస్టర్ మజ్ను’ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఏర్పడింది. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘హరి హర వీరమల్లు’ సినిమా ద్వారా మళ్లీ తెలుగు ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మొదట క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైంది. తరువాత అనివార్య పరిస్థితుల కారణంగా జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఇప్పుడిప్పుడే ప్రమోషన్‌ వేగాన్ని పెంచింది. ఇటీవలే హైదరాబాద్‌ శిల్పకళావేదికలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో నిధి అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా నిధి అగర్వాల్‌పై ఆయన చూపిన అభిమానం, అభినందనలు హైలెట్ అయ్యాయి. సినిమా పూర్తయ్యాక కూడా నిధి ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా, అన్ని ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నదని పవన్ వెల్లడించారు. ప్రమోషన్‌ లో ఆమె డెడికేషన్‌ను చూస్తే తనకూ సిగ్గు వేసిందని, ఒకానొక సందర్భంలో ఆమెను చూసి ఎంతో బాధగా అనిపించిందని చెప్పిన పవన్ కళ్యాణ్, ఆమె కష్టాన్ని నిజంగా అభినందించదగ్గదిగా అభిప్రాయపడ్డారు.

పవన్ కళ్యాణ్ తన స్పీచ్‌లో, “నిధి అగర్వాల్ సినిమాకి ఎంతగా ప్రమోషన్ చేస్తుందో చూస్తే నిజంగా ఆశ్చర్యం. కెరీర్‌ను, ఇతర విషయాలను పక్కనపెట్టి సినిమాకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ, రోజు, ఇంటర్వ్యూలు చేస్తూ సినిమాను తన భుజాలపై మోస్తోంది. ఆమెని చూస్తే నేనూ ప్రమోషన్‌లో యాక్టివ్‌గా ఉండాల్సిన అవసరం ఉందని ఫీలయ్యాను. ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా నేను కూడా ప్రమోషన్స్‌లో పాల్గొంటాను,” అని స్పష్టంగా చెప్పారు.

ఈ సందర్భంలో పవన్ మాటలకు నిధి అగర్వాల్ ఎమోషనల్‌గా స్పందించింది. స్టేజ్‌పై ఆమె, పవన్ కళ్యాణ్ గారు ఇలా ప్రశంసించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి బిగ్ సినిమా టీమ్‌లో భాగం కావడం గర్వంగా ఉంది. నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు ఇంత వరకు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు గుర్తించి ప్రోత్సహించినందుకు థాంక్స్ అంటూ కృతజ్ఞతలు తెలిపింది.