పవన్ కొత్త కమిట్ మెంట్లన్నీ 2029 తర్వాతేనా!
వరుసగా సినిమాలు..రాజకీయాలతో బిజీగా ఉండటంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
By: Tupaki Desk | 16 Sept 2025 4:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తీసుకోబోతున్నాడని ఇప్పటికే ప్రచారంలో ఉంది. వరుసగా సినిమాలు..రాజకీయాలతో బిజీగా ఉండటంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు పీకే గ్యాప్ లేకుండా కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారని...గ్యాప్ లేకుండా సినిమాలు చేసే అవకాశం ఉందని మరో వర్గం అంతే బలంగా వాదిస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ..తాజాగా పవన్ కళ్యాణ్ మాత్రం గ్యాప్ తీసుకోవడం ఖాయమంటూ పవన్ సన్నిహిత వర్గాల నుంచి లీకులందుతున్నాయి.
చకా చకా ఉస్తాద్ భగత్ సింగ్:
`ఓజీ`, `ఉస్తాద్ భగత్ సింగ్` రిలీజ్ అనంతరం పవన్ ఏకంగా మూడేళ్లు గ్యాప్ తీసుకుంటారని అంటు న్నారు. 2029 తర్వాతే మళ్లీ ఆయన సినిమాలు చేస్తారని అప్పటి వరకూ కెమెరా ముందుకొచ్చే అవకాశం ఎంత మాత్రం లేదంటున్నారు. `ఓజీ` సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం వాటి నుంచి రిలీవ్ అయిపోతారు. మరోవైపు నెల రోజుల్లోనే `ఉస్తాద్ భగత్ సింగ్` షూటింగ్ కూడా పూర్తవుతుంది. ఈసినిమా కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని హరీష్ శంకర్ సన్నాహాలు చేస్తున్నాడు.
అజ్ఞాత వాసి తర్వాత మళ్లీ గ్యాప్:
వచ్చే ఏడాది ఆరంభంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉంటుంది. అనంతరం పవన్ చేయాల్సిన ప్రాజెక్ట్ లు కొన్ని ఉన్నాయి. రామ్ తళ్లూరితో ఓ సినిమా చేయాలి. అలాగే సుంరేందర్ రెడ్డితోనూ ఓ సినిమా కు ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారంలోఉంది. ఇవి గాక ఇతర నిర్మాతల నుంచి పవన్ తీసుకున్న అడ్వా న్సులకు పని పూర్తి చేయాల్సి ఉంది. కానీ పవన్ పొలిటికల్ బిజీ సహా అరోగ్యం కూడా సహకరించకపో వడంతో 2029 తర్వాతే సినిమాలు చేసే అవకాశం ఉందంటున్నారు. `అజ్ఞాతవాసి` తర్వాత పవన్ కళ్యాణ్ మూడేళ్లు గ్యాప్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఏకధాటిగా సినిమాలు చేస్తూనే ఉన్నారు.
అసలు కారణాలేంటో?
సాధారణంగా పవన్ సినిమాలు వేగంగా పూర్తి చేయరు. ఏడాదికి ఒక సినిమా కూడా చేయరు. కానీ రాజకీ యాల్లోకి వచ్చిన తర్వాత పార్టీ నడపాలంటే డబ్బులు కావాలని..అందుకే సినిమాలు చేస్తున్నట్లు ప్రక టించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ అలాగే పని చేసుకుంటూ వచ్చారు. కానీ తన కారణంగా వీర మల్లు షూటింగ్ డిలే అవ్వడంతో తీసుకున్న పారితోషికం కూడా వెనక్కి తిరిగిచారు. ఓజీ విషయంలో కూడా ఇలాంటి మినహాయింపులు ఇచ్చినట్లు తెలిసింది. మరి తాజాగా వచ్చే ఏడాది నుంచి గ్యాప్ తీసుకుంటున్నారు? అన్న దాంట్లో నిజమెంత? నిజమే అయితే అసలు కారణాలు ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది.
