పవన్ ఫ్యాన్స్‌కి ఈ ఏడాది జాతరే...!
అయితే ఆ తర్వాత కమిట్ అయిన హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా లైన్‌లో ఉండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.
By: Tupaki Desk | 23 May 2025 12:00 PM ISTపవన్ కళ్యాణ్ చివరగా 2023లో 'బ్రో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా పెద్దగా సందడి చేయలేక పోయింది. ఇలా వచ్చి అలా వెళ్లి పోయింది. సినిమాలో పవన్ పాత్ర విషయంలోనూ అభిమానులు సంతృప్తి చెందలేదు. పవన్ కళ్యాణ్‌తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా బ్రో సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా మెగా ఫ్యాన్స్‌ని కూడా నిరుత్సాహపరచింది. అయితే ఆ తర్వాత కమిట్ అయిన హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా లైన్‌లో ఉండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.
గత రెండేళ్లుగా పవన్ నుంచి సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కారణంగా దాదాపు ఏడాది పాటు సినిమాలకు పవన్ దూరం అయ్యాడు. ఎన్నికలు ఏడాది ఉండగానే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఇక కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన విషయం తెల్సిందే. ఉప ముఖ్యమంత్రిగా ఏడాది పాటు బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు సినిమాల షూటింగ్‌లకు డేట్లు కేటాయిస్తున్నాడు. ఇటీవలే వీరమల్లు సినిమాను పూర్తి చేసిన పవన్ కళ్యాన్ ఓజీ సినిమాను పూర్తి చేసేందుకు కూడా డేట్లు కేటాయించారని తెలుస్తోంది.
ఉంటుందా... ఉండదా అనే అనుమానాలు వ్యక్తం అయిన 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమా సైతం పట్టాలెక్కబోతుంది. ఆ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. మొదట ఒక తమిళ్ మూవీకి ఈ సినిమా రీమేక్ అనే ప్రచారం జరిగింది. కానీ పవన్ గత రీమేక్ ఫలితాల నేపథ్యంలో కొత్త కథతో సినిమాను రూపొందించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇటీవల హరీష్ శంకర్ ఒక కొత్త కథను రెడీ చేశాడని, దానికి కూడా ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ సెట్ అవుతుందని సమాచారం అందుతోంది. ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసిన హరీష్ శంకర్ ఆ సన్నివేశాలను తన కొత్త కథలో సెట్ అయ్యే విధంగా స్క్రీన్ ప్లే ప్లాన్ చేశాడట.
మొత్తానికి పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్‌ల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్ అయింది. వచ్చే నెలలో హరి హర వీరమల్లు సినిమా విడుదల కన్ఫర్మ్ అయింది. మరో వైపు ఓజీ సినిమాను సైతం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాదిలో కన్ఫర్మ్ అయ్యాయి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఇదే ఏడాదిలో విడుదల చేసే విధంగా దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్‌కి ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తక్కువ డేట్లతోనే పూర్తి చేసే విధంగా దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్లాన్ చేశాడట. అందుకు తగ్గట్లుగానే సినిమా ఇదే ఏడాది చివరి వరకు పూర్తి చేసి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఒకే ఏడాదిలో పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు విడుదల ఉంటాయి. అంటే ఫ్యాన్స్‌కి పండగ కాదు.. జాతరే అనడంలో సందేహం లేదు.
