పవన్ రెమ్యునరేషన్.. హిట్టయితేనే లాభం!
పవన్ కళ్యాణ్ రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటున్నట్టు ఆ మధ్య ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే ఈ సినిమాకి మాత్రం అంత రెమ్యునరేషన్ తీసుకోలేదనే టాక్ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 24 May 2025 12:06 PM ISTసినిమా పరిశ్రమలో స్టార్ హీరోల రెమ్యునరేషన్ అనేది ఎప్పుడూ హాట్ టాపిక్. ముఖ్యంగా రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లో లిమిటెడ్ టైమ్ మాత్రమే ఇస్తున్నారు. కానీ అందుకు రెమ్యునరేషన్ మాత్రం పెరుగుతోందని వార్తలొచ్చిన తరుణంలో.. ఆయన లేటెస్ట్ సినిమా హరిహర వీర మల్లు విషయంలో మెల్లగా రియలిటీ వెలుగులోకి వస్తోంది. సాధారణంగా పవన్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ప్రకారం నిర్మాతలు 60 నుంచి 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటున్నట్టు ఆ మధ్య ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే ఈ సినిమాకి మాత్రం అంత రెమ్యునరేషన్ తీసుకోలేదనే టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం రూ.11 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నట్టు తెలుస్తోంది. మొదట రూ.10 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత.. షూటింగ్ టైమ్ పెరగడంతో అదనంగా మరో కోటి చెల్లించారట.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పవన్ భారీగా డిమాండ్ చేయకుండానే నిర్మాత పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించారన్న మాట. సాధారణంగా టాప్ స్టార్లు అలా తగ్గించే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నారు. అలాగే, సినిమాల్లోకి వస్తున్న కొత్త నిర్మాతలకు తలనొప్పి కాకూడదనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నారన్న వాదన కూడ వినిపిస్తోంది. ఇది వాస్తవమైతే, టాలీవుడ్ స్టార్ హీరోలలో ఈ రకమైన మార్పు ఒక కొత్త మార్గాన్ని చూపించగలదు.
తాజా సమాచారం ప్రకారం, నిర్మాత ఈ సినిమాపై భారీ స్థాయిలో ప్రమోషన్లు చేయడానికి సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన సహకారం పట్ల కృతజ్ఞతగా భారీ బడ్జెట్‌తో ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించిన లాభాల్లో భాగస్వామ్యం కూడా ఇవ్వనున్నారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఇది నిజమైతే, పారదర్శకతతో కూడిన చక్కటి ప్రొఫిట్ షేరింగ్ మోడల్‌గా చెప్పొచ్చు.
ఇటీవల టాలీవుడ్‌లో స్టార్ హీరోల రెమ్యునరేషన్ విషయంలో ఎన్నో విమర్శలు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమలో మంచి మార్పుకు దారితీయవచ్చు. ఒకవేళ సినిమా పెద్ద విజయం సాధిస్తే.. హీరోకి లాభాల్లో వాటా ఇచ్చే మోడల్‌ను ఇతర స్టార్ హీరోలు కూడా అనుసరించే అవకాశముంది. ఇలా చేయడం వల్ల నిర్మాతల భారం తగ్గి, టాప్ హీరోలతో సినిమాలు చేసేందుకు కొత్త ఫిల్మ్‌మేకర్లకు అవకాశం లభించవచ్చు.
ఇక హరిహర వీర మల్లు సినిమా జూన్‌లో రిలీజ్ కానుంది. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ పవర్‌ఫుల్ స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.
