వీరమల్లు మౌనం..బయ్యర్స్‌లో డేంజర్ బెల్స్
కొన్ని సినిమాలు ఊహించని విధంగా పూర్తయి థియేటర్లలోకి వచ్చేస్తాయి. మరి కొన్ని సినిమాలు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావు.
By: Tupaki Desk | 1 May 2025 10:30 AMకొన్ని సినిమాలు ఊహించని విధంగా పూర్తయి థియేటర్లలోకి వచ్చేస్తాయి. మరి కొన్ని సినిమాలు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావు. అంతేనా థియేటర్లలోకి ఎప్పడోస్తాయనే క్లారిటీ ఉండదు. ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ అభిమానుల సహనాన్ని పరీక్షిస్తోంది `హరి హర వీరమల్లు`. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని భారీ చిత్రాల నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ మేకర్స్‌కి కాలం కలిసి రావడం లేదు.
చాలా కాలంగా ఆగుతూ సాగుతూ వున్న ఈ మూవీ షూటింగ్ పవన్ నాలుగైదు రోజుల షూటింగ్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. పవన్ ఆ డేట్స్ ఇస్తే బ్యాలెన్స్ షూటింగ్‌ని పూర్తి చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు భారీ స్థాయిలో తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ కాలం కలిసి రావడం లేదు. కారణం పవన్ క్రియాశీల రాజకీయాల్లో బిజీగా ఉండటమే. అంతే కాకుండా ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతల్లో ఆయన బిజీగా ఉండటం వల్ల డేట్స్ కేటాయించలేకపోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ రిలీజ్ ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారింది.
పవన్‌కు సంబంధించిన షూటింగ్‌ని చకచకా పూర్తి చేసి మే 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది జరిగడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యం. దీంతో సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడింది. దీంతో ఈ మూవీ స్థానంలో శ్రీవిష్ణు `సింగిల్`, సమంత నిర్మించిన `శుభం` వచ్చేస్తున్నాయి. కానీ వీరమల్లు రిలీజ్‌పై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ముందు అనుకున్న దానికి అటు ఇటుగా అంటూ రెండు మూడు వారాల్లో వచ్చే అవకాశం ఉందా? అంటే దానిపై కూడా స్పష్టతలేదు. టీమ్ మౌనం పాటిస్తోంది. దీంతో అభిమానుల్లో విరమల్లు రిలీజ్‌పై గందరగోళం నెలకొంది.
పవన్ వరుస మీటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ బ్యాలెన్స్ షూటింగ్‌కి డేట్స్ కేటాయించలేకపోతున్నారు. దీంతో సినిమా ఎప్పటికి పూర్తవుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపై స్పష్టతకొరవడుతోంది. మేకర్స్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉండటంతో ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. పవన్ డేట్స్ ఇస్తే తప్ప ఈ మూవీ రిలీజ్ పై స్పష్టత వచ్చే అవకాశం లేదు. దీంతో సినిమాపై బజ్ కనిపించకపోవడంతో బయ్యర్లలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. పోనీ తాజా పరిస్థితిని కూల్ చేయడానికి మేకర్స్ ఏదైనా చేస్తున్నారా? అంటే అదీ లేదు. క్రిష్ తప్పుకోవడంతో ఆ బాధ్యతల్ని ఏ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన దృష్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పైనే ఉంది.
ఇతర విషయాలు, సినిమా రిలీజ్‌పై వస్తున్న వార్తలని ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏ.ఎం.రత్నం పరిస్థితి కూడా అంతే. ఏదైనా కొత్తగా ట్రైలర్‌ని రిలీజ్ చేసి వార్తలకు చెక్ పెడతారా అనుకుంటే అదీ లేదు. టీమ్ అంతా మౌనాన్ని పాటిస్తున్నారు. దీంతో అటు బయ్యర్లకు, ఇటు ఫ్యాన్స్‌కు మెంటలెక్కిపోతోంది. మే లో రావడం లేదు సరే కనీసం జూన్‌లో అయినా వస్తుందా? అని అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జూన్‌లో కన్నప్ప, కుబేర వస్తున్నాయి. వాటితో రిలీజ్ అంటే వాటికి ఇబ్బంది. అలా చేయరు. దీంతో జూన్ ఫస్ట్ లేదా సెకండ్ వీక్‌లోనే రావాలి. కానీ టీమ్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఫస్ట్ పార్ట్‌కే ఇలా ఉంటే ఇక పార్ట్ 2 పరిస్థితి ఏంటో అని అంతా పెదవి విరుస్తున్నారు.