Begin typing your search above and press return to search.

నీ మరణాన్ని నమ్మలేక పోతున్నాం

ఇప్పటి వరకు చనిపోయిన వారి జ్ఞాపకాల నుంచి బయటకు రాకుండానే మరో నటుడు మృతి చెందడంతో ప్రేక్షకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 March 2024 12:19 PM GMT
నీ మరణాన్ని నమ్మలేక పోతున్నాం
X

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వరుసగా ఒకరి తర్వాత ఒకరు మృతి చెందుతూ ప్రేక్షకులకు, ఇండస్ట్రీ వర్గాల వారికి కన్నీళ్లు మిగుల్చుతున్నారు. ఇప్పటి వరకు చనిపోయిన వారి జ్ఞాపకాల నుంచి బయటకు రాకుండానే మరో నటుడు మృతి చెందడంతో ప్రేక్షకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

చక్రవారం మరియు మొగలి రేకులు సీరియల్స్ ద్వారా నటుడిగా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన పవిత్రనాథ్‌ మృతి చెందారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరణ వార్తను సీరియల్‌ నటుడు ఇంద్రనీల్ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఇంద్రనీల్ మరియు ఆయన భార్య మేఘన స్పందిస్తూ... నీ మరణం ను నమ్మలేకపోతున్నాం. మొదట ఇది నిజం అయ్యి ఉండదని, నిజం కాకూడదని కోరుకున్నాం. కానీ నువ్వు ఈ లోకాన్ని వదిలి వెళ్లి పోయిన విషయం తెలిసి జీర్ణించుకోలేక పోతున్నాం.. ఇప్పటికి కూడా మాతో నువ్వు ఉన్నట్లుగానే అనిపిస్తుంది అంటూ ఎమోషనల్‌ అయ్యారు.

1980, 90 కిడ్స్ కి బుల్లి తెర లో వచ్చిన చక్రవాకం మరియు మొగలి రేకులు సీరియల్స్ చాలా స్పెషల్‌. ఆ సీరియల్‌ లో కీలక పాత్రలో నటించడం ద్వారా అప్పట్లో పవిత్ర నాథ్ కి యూత్‌ లో మంచి ఫాలోయింగ్‌ ఉండేది. కొన్ని సినిమాల్లో కూడా నటించాడు కానీ వెండి తెరపై ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేక పోయాడు.