Begin typing your search above and press return to search.

డైరెక్టర్ 4 ఏళ్ళ ప్రయత్నం.. హీరో గ్రీన్ సిగ్నల్!

దాదాపు నాలుగేళ్ల నుంచి కళ్యాణ్ రామ్ తో సినిమా చేయాలి అని పవన్ తో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాడు. అయితే వివిధ కారణాల వలన ఆ ప్రాజెక్టు వాయిదా పడుతూ వస్తోంది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 12:30 AM GMT
డైరెక్టర్ 4 ఏళ్ళ ప్రయత్నం.. హీరో గ్రీన్ సిగ్నల్!
X

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు అనుకున్న ప్రాజెక్టులు చాలా ఆలస్యంగా మొదలవుతూ ఉంటాయి. కొందరు దర్శకులు వారికి నచ్చిన హీరోల కోసం సినిమా చేయడానికి ఎన్నేళ్లయినా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక యువ దర్శకుడు పవన్ సాదినేని కూడా దాదాపు నాలుగేళ్ల నుంచి కేవలం ఒకే ఒక హీరోతో ఒక ప్రాజెక్టును మొదలుపెట్టాలి అని ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది.


దర్శకుడు పవన్ సాధినేని సేనాపతి - దయా అనే వెబ్ ప్రాజెక్టులతో మంచి గుర్తింపును అందుకున్నాడు. అంతకుముందు అతను ప్రేమ ఇష్క్ కాదల్ ఒక సినిమాలతో కూడా మంచి గుర్తింపును అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వెంటనే అతను ఒక మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయాలి అని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ హీరో మరెవరో కాదు కళ్యాణ్ రామ్.

దాదాపు నాలుగేళ్ల నుంచి కళ్యాణ్ రామ్ తో సినిమా చేయాలి అని పవన్ తో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాడు. అయితే వివిధ కారణాల వలన ఆ ప్రాజెక్టు వాయిదా పడుతూ వస్తోంది. ఇక మొత్తానికి ఇటీవల మళ్ళీ కళ్యాణ్ రామ్ ఆ దర్శకుడితో చర్చలు జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. అసలైతే ఈ సినిమాలో మరొక సీనియర్ హీరోని కూడా తీసుకోవాలని అనుకున్నారట.

2019లోనే సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నారు కానీ ఆ తర్వాత ఆ సినిమా ఎందుకో పట్టాలు ఎక్కలేదు. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఐతే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇందులో మరొక ముఖ్యమైన పాత్ర కోసం ఎవరైనా హీరోను సంప్రదించాలి అని దర్శకుడు అనుకుంటున్నాడు. ప్రస్తుతం ఆ విషయంలోనే చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక వీలైనంత త్వరగా పూర్తి స్థాయిలో నటీనటులను ఫిక్స్ చేసి సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ కూడా సక్సెస్ చూసి చాలా కాలం అయింది. బింబిసార సినిమాతో ఆమధ్య మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత అతను చేసిన అమిగోస్ సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది. ఇక మళ్ళీ ఇప్పుడు డెవిల్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా కూడా డిసెంబర్ లోనే విడుదల కావాల్సింది. కానీ పోటీ ఎక్కువగా ఉండడంతో సినిమాను వాయిదా వేసుకున్నారు.