Begin typing your search above and press return to search.

ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గ‌ర్ కొడుకు పెళ్లి

ఆర్నాల్డ్ కుమారుడు పాట్రిక్ స్క్వార్జెనెగర్ ప్ర‌ముఖ మోడ‌ల్ కం న‌టుడు.. అంత‌కుమించి ఎంట‌ర్ ప్రెన్యూర్

By:  Tupaki Desk   |   28 Dec 2023 9:50 AM IST
ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గ‌ర్ కొడుకు పెళ్లి
X

హాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గ‌ర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టెర్నినేట‌ర్, ప్రిడేట‌ర్ ఫ్రాంఛైజీ చిత్రాల క‌థానాయ‌కుడిగా అత‌డికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణ‌మైన‌ది. అమెరికా కాలిఫోర్నియా మాజీ గ‌వ‌ర్న‌ర్ గాను సుప‌రిచితుడు. అయితే ఆర్నాల్డ్ కి ఒక న‌ట‌వార‌సుడు ఉన్నాడు ఉన్న సంగ‌తి తెలుగు ప్ర‌జ‌ల‌కు తెలిసింది త‌క్కువే. అత‌డు డ‌జ‌ను సినిమాల్లో న‌టించినా కానీ ఎక్కువ‌గా తండ్రి వ్యాపారాల‌పై ఫోక‌స్ చేయ‌డంతో అంత‌గా సుపరిచితుడు కాలేదు.


ఆర్నాల్డ్ కుమారుడు పాట్రిక్ స్క్వార్జెనెగర్ ప్ర‌ముఖ మోడ‌ల్ కం న‌టుడు.. అంత‌కుమించి ఎంట‌ర్ ప్రెన్యూర్. అత‌డు ఇప్పుడు త‌న చిర‌కాల స్నేహితురాలిని పెళ్లాడ‌బోతున్నాడ‌న్న‌ది స‌మాచారం. పాట్రిక్ త‌న ప్రియురాలు ఏబీ ఛాంపియన్ నిశ్చితార్థం పూర్త‌యింది. పాట్రిక్ స్క్వార్జెనెగర్ - అబ్బి ఛాంపియన్‌లు మొదటిసారిగా 2015లో క‌లిసారు. 2016లో తమ సంబంధాన్ని అధికారికం చేసారు. ఈ జంట‌ ఏడు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత డిసెంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో ఈ జోడీ పెళ్లితో ఒక‌టి కానున్నారు. వ‌జ్రాల అంగుళీకం తొడిగిన త‌ర్వాత‌ పాట్రిక్ స్క్వార్జెనెగర్ త‌న ప్రియురాలు, కాబోయే భార్య‌ అబ్బి ఛాంపియన్ చెంపపై స్వీట్ కిస్ చేస్తున్న ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

పాట్రిక్ స్క్వార్జెనెగర్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ - జర్నలిస్ట్ మరియా శ్రీవర్ కుమారుడు. అలాగే పాట్రిక్ ప్రియురాలు అబ్బి ఛాంపియన్ వృత్తిరీత్యా మోడల్. హి ప్రాడా, రాల్ఫ్ లారెన్, చానెల్ స‌హా ప‌లు ప్రధాన లేబుల్‌ల కోసం ర్యాంప్‌పై ప్ర‌చారం చేసారు.

చాలా కాలంగా స్నేహంలో ఉన్న ఈ జంట డిసెంబర్ 26న నిశ్చితార్థం చేసుకుని సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లారు. ప్రపంచానికి వారి నిశ్చితార్థం గురించి తెలియజేస్తూ లవ్‌బర్డ్స్ త‌మ‌ బీచ్‌సైడ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటోల‌ను ఉమ్మడి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో షేర్ చేసారు. ఇక అబ్బి కి తొడిగిన‌ నిశ్చితార్థపు ఉంగరంలో ఒకటి కాదు రెండు వజ్రాలు ఉన్నాయి. ఎరుపు గులాబీలతో అలంకరించిన గ్రాండ్ హార్ట్ షేప్డ్ ఫ్ల‌వ‌ర్స్ ప్రదర్శన ముందు ఈ జంట ముద్దులు పెట్టుకుంటున్న మ‌రొక ఫోటో వైర‌ల్ అయింది.

30 ఏళ్ల పాట్రిక్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ""ఆమె అవును అని చెప్పింది"" అంటూ ఆనందాన్ని షేర్ చేస్కున్నాడు. అత‌డు ఇప్పుడు కాబోయే భార్య అబ్బి ఛాంపియన్ త్రోబాక్ ఫోటోను కూడా షేర్ చేసాడు. 9 సంవత్సరాల క్రితం ఇద్దరు చిన్న పిల్లలు ప్రేమలో పడ్డారు అని స‌ర‌దాగా రాశారు. టేలర్ అండ్ టే లాట్నర్ కొత్తగా నిశ్చితార్థం చేసుకున్న జంటను అభినందించారు. గ్లెన్ పావెల్, టేలర్ లాట్నర్, మేడో వాకర్, డైలాన్ స్ప్రౌస్, బెల్లా థోర్న్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలతో వ్యాఖ్యల విభాగాన్ని నింపారు.

పాట్రిక్ స్క్వార్జెనెగర్ తల్లి మరియా శ్రీవర్ ఈ జంటను అభినందిస్తూ అబ్బి -పాట్రిక్ పోస్ట్‌పై వ్యాఖ్యానించారు. ""యిప్పీ బ్రేవో మేమంతా మీ కోసం, మీ ప్రేమ కోసం, మీ ఇప్పుటి కోసం, మీ భవిష్యత్తు కోసం చాలా సంతోషంగా ఉన్నాము. మీ ప్రేమ సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది""అని రాసారు.