స్పై థ్రిల్లర్ స్వీక్వెల్ మొత్తం చిలీలోనేనా!
యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ నుంచి రిలీజ్ అయిన `పఠాన్` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.
By: Tupaki Desk | 12 May 2025 9:30 AMయశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ నుంచి రిలీజ్ అయిన `పఠాన్` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. షారుక్ ఖాన్ కథానాయకుడిగా సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కించిన సినిమా వసూళ్లతో భాక్సాఫీస్ ని షేక్ చేసింది. 1000 కోట్ల వసూళ్లతో షారుక్ కెరీర్ లో మరో మైలు రాయిగా నిలిచింది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల కు కొత్త మీనింగ్ తీసుకొచ్చింది. అప్పటికే సరైన సక్సెస్ లు లేక విలవిలాడుతోన్న బాలీవుడ్ ని మళ్లీ పైకి లేపిన చిత్రమిదే.
తాజాగా `పఠాన్ 2`కి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలింస్ మరింత ప్రతిష్టా త్మకంగా భావిస్తోంది. `పఠాన్` ను మించి రెండవ భాగం పీక్స్ లో ఉండాలని ప్లాన్ చేస్తుంది. దీనిలో భాగంగా షూటింగ్ అంతా చిలిలోనే ప్లాన్ చేస్తున్నారుట. ప్రస్తుతం అనుమతుల కోసం అక్కడ ప్రభు త్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ కథ అక్కడ లోకేషన్లు డిమాండ్ చేయడంతో యశ్ రాజ్ ఫిలింస్ ఏమాత్రం రాజీ పడకుండా మేకర్స్ కు పూర్తి సహకారం అందిస్తున్నారు.
అనుమతులు లభించగానే నటీనటుల బిజీ షెడ్యూల్స్ ను బట్టి చిత్రీకరణకు వెళ్లేలా ప్లాన్ చేసుకుం టున్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ కూడా కొత్త చిత్రాలేవి కమిట్ అవ్వలేదు. `డంకీ` రిలీజ్ తర్వాత షారుక్ కొత్త సినిమా రిలీజ్ అవ్వలేదు. గత ఏడాదంతా ఖాళీగానే ఉన్నారు. కుమార్తే సుహానాఖాన్ నటిస్తోన్న `కింగ్` చిత్రంలో మాత్రం కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవలం కుమార్తె కోసం మాత్రమే నటిస్తోన్న చిత్రమిది.
దీంతో షారుక్ కొత్త సినిమా ప్రకటన ఎప్పుడని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో `పఠాన్` సీక్వెల్ తోనే షారుక్ వస్తే అంతకు మించిన సంతోషం ఉండదు. ఓ భారీ హిట్ అందు కున్నా? ప్లాప్ అందుకున్నా షారుక్ కొత్త సినిమా మొదలు పెట్టడానికి సమయం తీసుకుంటారు.