Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఒక్క వాచ్ ధర ఎన్ని కోట్లో తెలుసా..?

ఈ సినిమా సంగతి పక్కన పెడితే, ఇటీవల ఎన్టీఆర్ సోదరి సుహాసిని కుమారుడి పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   23 Aug 2023 11:13 AM GMT
ఎన్టీఆర్ ఒక్క వాచ్ ధర ఎన్ని కోట్లో తెలుసా..?
X

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ దేవర మూవీ ఎలా ఉండబోతోందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఈ మూవీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే, ఇటీవల ఎన్టీఆర్ సోదరి సుహాసిని కుమారుడి పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లిలో ఎన్టీఆర్ సందడి చేశారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ ముగ్గురు కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే, ఆ ఫోటోల్లో ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ హాట్ టాపిక్ గా మారింది.

Patek Philippe కంపెనీకి చెందిన వాచ్ ఇది. దీని ఖరీదు రూ.2.45కోట్లు ఉంటుందని అంచనా. ఈ ధర చూసి ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు. కాగా, ఇలాంటి వాచ్ లు ఆయన దగ్గర చాలానే ఉన్నాయి. గతంలోనూ తారక్ ధరించిన వాచ్ ల ధరలు నెట్టింట చర్చనీయాశంగా మారాయి. గ్లోబల్ స్టార్ రేంజ్ లో ఉండి. ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే ఎన్టీఆర్ వద్ద ఈ మాత్రం ఖరీదు వాచ్ ఉండటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వాచ్ కాకుండా, నందమూరి వారసులు ఇలా ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఫ్యాన్స్ ని మరింత ఖుషీ చేసింది. ఇక, దేవర మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు. ఆచార్య డిజాస్టర్ తో ఉన్న కొరటాల శివ, ఈ సినిమాని ఎలా తీస్తాడా చూడాలి.