Begin typing your search above and press return to search.

'దూత' నటి @ 36 పిల్లలు

కొచ్చికి చెందిన ఈ అమ్మడు ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా తన హోం టూర్ ను ప్రేక్షకులకు మరియు తన ఫాలోవర్స్ కి చూపించింది.

By:  Tupaki Desk   |   23 March 2024 1:08 PM GMT
దూత నటి @ 36 పిల్లలు
X

నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటించిన దూత వెబ్‌ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పార్వతి తిరువత్తు. కొచ్చికి చెందిన ఈ అమ్మడు ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా తన హోం టూర్ ను ప్రేక్షకులకు మరియు తన ఫాలోవర్స్ కి చూపించింది.

మూడు బెడ్‌ రూం ల ఇంట్లో ఎక్కడ చూసినా కూడా పచ్చని చెట్టు కనిపిస్తున్నాయి. ఈ స్థాయి పచ్చదనం మెయింటెన్ చేస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం అంటూ చాలా మంది సోషల్‌ మీడియా ద్వారా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు.

తన ఇంట్లో మామిడితో పాటు ఫ్రూట్‌ సలాడ్‌ కి కావాల్సిన అన్ని రకాల పండ్లు ఉంటాయి అంటూ చెప్పుకొచ్చింది. తన ఇంట్లో మొత్తంగా 36 రకాల మొక్కలు ఉన్నాయి. వాటికి నేను తల్లి మాదిరిగా ప్రతి రోజు సేవ చేస్తాను అన్నట్లుగా కూడా ఆ వీడియోలో పేర్కొంది.

సాధారణంగా ఇంట్లో ఒకటి రెండు చెట్లు ఉంటేనే వాటిని పట్టించుకోవడం చాలా కష్టం అవుతుంది. అలాంటిది పార్వతి తిరువత్తు ఏకంగా 36 రకాల మొక్కలను తన పిల్లల మాదిరిగా ప్రతి రోజు వాటిని చూసుకోవడం నిజంగా గొప్ప విషయం.

ఇంట్లో మరియు బాల్కనీ ఇంకా పైనా ఎక్కడ చూసినా పచ్చదనం ఉండటం వల్ల ప్రశాంతంగా ఉంటుందని పార్వతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నటిగా ఈమె మలయాళంలో ఒకటి రెండు సినిమాల్లో నటిస్తోంది. ముందు ముందు తెలుగులో కూడా ఈమె నటిస్తుందేమో చూడాలి.