ఆయన ఎంట్రీ ఖరారైతే చాలామందికి విలన్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో `ఉస్తాద్ భగత్ సింగ్` తెరకెక్కు తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 Jun 2025 5:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో `ఉస్తాద్ భగత్ సింగ్` తెరకెక్కు తోన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా సెట్స్ కు హాజరవుతున్నారు. ఆయనపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ అనంతరం విదేశాల్లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో పవన్ సహా టీమ్ అంతా ప్లైట్ ఎక్కనున్నారు. అయితే ఇందులో విలన్ పాత్ర ఎవరు పోషిస్తున్నారు? అన్నది ఇంత వరకూ క్లారిటీ రాలేదు.
హరీష్ శంకర్ విలన్ అంటే ఆ పాత్రలో కాస్త హాస్యం కూడా ఉంటుంది. అందులోనూ పవన్ కళ్యాణ్ తో కాంబినేషన్ సీన్లు అంటే అన్ని రకాలుగా కలిసి రావాలి. ఈ నేపథ్యంలో ఆ రోల్ కోసం ఇంతవరకూ ఎవర్నీ ఎంపిక చేయేలేదు. తాజాగా అందుతోన్న సమాచారం ఏంటంటే ? ఆ రోల్ కోసం తమిళ నటుడు పార్తీబన్ ని తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి అన్నపూర్ణ స్టూడియోస్ లో అతడిపై లుక్ టెస్ట్ కూడా నిర్వహించారుట.
పాత్రకు సెట్ అవ్వడంతో పార్తీబన్ ఎంపిక ఖరారైనట్లు వినిపిస్తుంది. పార్తీబన్ ఇంత వరకూ ఒక్క తెలుగు సినిమా మాత్రమే చేసాడు. అదీ కామియో పాత్రలోనే. ఆ తర్వాత మరే తెలుగు సినిమాలో నటించలేదు. నటుడిగా, డైరెక్టర్ గా మంచి పేరుంది. అక్కడ ఎన్నో సినిమాలు చేసారు. పార్తీబన్ టాలీవుడ్ లో సక్సెస్ అయితే చాలా మంది నటుల ప్లేస్ లను రీప్లేస్ చేసే అవకాశం ఉంది.
ముఖ్యంగా సముద్రఖని. ఈయన చాలా కాలాంగా తెలుగు సినిమాలు చేస్తున్నాడు. విలన్ గా, కీలక పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో పార్తీబన్ టాలీవుడ్ ఎంట్రీ అన్నది సముద్రఖనికి పోటీ లాంటిందే. పార్తీబన్ సక్సెస్ అయితే సముద్రఖనితో పాటు టాలీవుడ్ లో చాలా మంది నటులకు పోటీ తప్పదు.
