Begin typing your search above and press return to search.

సుహాసిని బ్యూటీపై పార్తీబ‌న్ కామెంట్!

కోలీవుడ్ మ‌ల్టీట్యాలెంటెడ్ ప‌ర్స‌నాల్టీ పార్తీబ‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   13 Jun 2025 1:00 AM IST
సుహాసిని బ్యూటీపై పార్తీబ‌న్ కామెంట్!
X

కోలీవుడ్ మ‌ల్టీట్యాలెంటెడ్ ప‌ర్స‌నాల్టీ పార్తీబ‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా, గాయ‌కుడిగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. తాజాగా పార్తీబ‌న్ వ‌ర్డిక్ట్ సినిమా ఈవెంట్ లో డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం స‌తీమ‌ణి, న‌టి సుహాసినిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. `ఇక్క‌డికి వ‌చ్చిన వారంతా సుహాసిన న‌ట‌న గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆమె ఎంత గొప్ప ఆత్మ విశ్వాసం క‌లిగి ఉందో చెప్పాలి.

ఓ రోజు నాకు ఆవిడ ఫోన్ చేసి పార్తీబ‌న్ నాకు 50 ఏళ్లు నిండాయ‌ని చెప్పారు. సాధార‌ణంగా ఏ మ‌హిళ 28 ఏళ్లు దాటిన త‌ర్వాత వ‌య‌సు బ‌య‌ట‌కు చెప్ప‌రు. చెప్పుకోవ‌డానికి ఇష్ట‌ప‌డని వాళ్లే ఎక్కువ‌గా ఉంటారు. అలాంటిది సుహాసిని ఫోన్ చేసి ఆమె వ‌య‌సు గురించి చెప్ప‌గానే త‌న ఆత్మ విశ్వాసం ప్ర‌తిబింబించింది. ఇది చాలా గొప్ప విష‌యం. 50 ఏళ్లు మీద ప‌డినా తాను ఎంత అందంగా ఉందో మీరే చూడండి అన‌డంతో అక్క‌డున్న వారంతా ఘ‌ల్లున న‌వ్వారు.

`వ‌ర్డిక్ట్` సినిమా పార్తీబ‌న్ ప్ర‌ధాన పాత్ర ధారుడిగా తెర‌కెక్కుతోంది. సుహాసిని కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇద్ద‌రు క‌లిసి చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లి సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి కృష్ణ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హి స్తున్నారు. ప్ర‌స్తుతం పార్తీబ‌ర్ డైరెక్ట‌ర్ గా కంటే న‌టుడిగా బిజీగా ఉన్నారు. కోలీవుడ్ లో చాలా సినిమాలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వెబ్ సిరీస్ ల్లోకి కూడా ఎంట‌ర్ అయ్యారు.

పార్తీబ‌న్ వ‌య‌సు 67 ఏళ్లు అయినా? ఇప్ప‌టికీ 30 ఏళ్ల కుర్రాడిలా ప‌నిచేస్తున్నారు. న‌టుడిగా అవ‌కాశం వ‌స్తే అలా...డైరెక్ట‌ర్ ఛాన్స్ వ‌స్తే కెప్టెన్ కుర్చీ ఎక్కేస్తున్నారు. గాయ‌కుడిగా అవ‌కాశం వ‌స్తే మైక్ ప‌ట్టుకుని ఇర‌గ దీస్తున్నారు. వ‌య‌సు జ‌స్ట్ నెంబ‌ర్ మాత్ర‌మేన‌ని ప్రూవ్ చేస్తున్నారు.