Begin typing your search above and press return to search.

ఒక్కటైన హీరోయిన్‌, ఎంపీ... వైభవంగా వివాహం

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ పరిణీతి చోప్రా మరియు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   25 Sep 2023 6:58 AM GMT
ఒక్కటైన హీరోయిన్‌, ఎంపీ... వైభవంగా వివాహం
X

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ పరిణీతి చోప్రా మరియు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. ఇద్దరి ప్రేమ విషయమై చాలా రోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ చాలా మంది వాటిని పుకార్లే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఇద్దరి వివాహ నిశ్చితార్థం జరిగిందో అప్పుడే అంతా కూడా షాక్ అయ్యారు.


పరిణీతి చోప్రా ఎంపీ అయిన రాఘవ్ చద్దా తో చాలా కాలంగా ప్రేమలో ఉందని బాలీవుడ్ వర్గాల టాక్. ఇద్దరి ప్రేమ ఎక్కడ మొదలు అయింది, ఇద్దరి మధ్య పెళ్లి వరకు దారి తీసిన పరిస్థితులు ఏంటి అనేది సినిమాటిక్ గా జరిగింది అనేది బాలీవుడ్ వర్గాల టాక్. ఆ విషయం పక్కన పెడితే వైభవంగా వీరి వివాహం జరిగింది.


రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో వీరి వివాహం వైభవంగా జరిగింది. పరిణీతి చోప్రా తరపు బంధు మిత్రులతో పాటు ఆప్ ఎంపీ అవ్వడం వల్ల రాఘవ్‌ చద్దా తరపున భారీ ఎత్తున పొలిటికల్‌ పార్టీల నాయకులు హాజరు అయ్యారు. దిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్‌, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హాజరు అయ్యారు.


22న పరిణీతి చోప్రా మరియు రాఘవ్ చద్దా లతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉదయ్ పూర్ చేరుకున్నారు. ఆ రోజు నుండి నాలుగు రోజుల పాటు వరుసగా పెళ్లి హంగామాతో ప్యాలెస్‌ వెలిగి పోయింది. బాలీవుడ్‌ ప్రముఖులు సంగీత్ కార్యక్రమానికి హాజరు అవ్వడంతో కలర్ ఫుల్ గా సాగింది.


పెళ్లి తర్వాత పరిణీతి చోప్రా మరియు రాఘవ్ చద్దాల ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పింక్‌ చీర కట్టు లో నుదుట బొట్టు పెట్టుకుని సింపుల్ గా మెడలో ఒక హారం ధరించి, చెవులకు సింపుల్‌ ఆభరణం ధరించి రెండు చేతుల నిండుగా మ్యాచింగ్ గాజులు ధరించి పరిణీతి చోప్రా నిండైన గృహిణిగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.