Begin typing your search above and press return to search.

పరిణీతి పెళ్లిలో అదే క‌దా అస‌లు ట్విస్టు

కెరీర్ పరంగా చూస్తే.. పరిణీతి చోప్రా తదుపరి అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న 'మిషన్ రాణిగంజ్' అనే థ్రిల్లర్‌లో కనిపించనుంది

By:  Tupaki Desk   |   15 Sep 2023 4:27 AM GMT
పరిణీతి పెళ్లిలో అదే క‌దా అస‌లు ట్విస్టు
X

అందం ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకున్న న‌టి ప‌రిణీతి చోప్రా. పారీ అని అభిమానులు ప్రేమ‌గా పిలుచుకుంటారు. ఇటీవ‌ల కొన్ని ప్రయోగాత్మ‌క సినిమాల్లో న‌టించిన పారీ కెరీర్ ప‌రంగా నెమ్మ‌దించినా కానీ, ఆప్ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దాతో ప్రేమాయ‌ణం, పెళ్లి వ‌గైరా విష‌యాల‌తో వార్తల్లో నిలిచింది. ఈ జంటకు కొన్ని నెలల క్రితం గ్రాండ్ గా నిశ్చితార్థం అయింది. సెప్టెంబర్ 24 న పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. పెళ్లి సంబరాలు ప్రారంభమయ్యాయి. వివాహం మూడు రోజుల సంబ‌రంగా జ‌ర‌గ‌నుంది.

ఇప్పుడు క‌రోనా టెన్ష‌న్ లేదు. అందువ‌ల్ల పారీ పెళ్లికి అతిథుల క‌ళ ఒక స్థాయిలో ఉండ‌నుంది. మూడు రోజుల పెళ్లితో పాటు విందు వినోద కార్య‌క్ర‌మాలు పెద్ద రేంజులో జ‌ర‌గ‌నున్నాయ‌ని స‌మాచారం.

దీనికోసం రాజ‌స్థాన్- ఉదయపూర్‌లోని భారీ లీలా ప్యాలెస్‌లో వేడుకలు జరుగనుండగా, వివాహ వేడుక తాజ్ లేక్ ప్యాలెస్‌లో జరగనుంది. సెప్టెంబర్ 30న చండీగఢ్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుందని తెలిసింది.

కెరీర్ పరంగా చూస్తే.. పరిణీతి చోప్రా తదుపరి అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న 'మిషన్ రాణిగంజ్' అనే థ్రిల్లర్‌లో కనిపించనుంది. పారీ ఇందులో న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లో న‌టించింది. బొగ్గు గ‌నిలో కార్మికులు జ‌ల‌పాతంలో చిక్కుకుపోయాక ఎలాంటి ఆప‌రేష‌న్ జ‌రిగింది? ఇందులో అక్ష‌య్, పారీ పాత్ర‌లు ఏమిట‌న్న‌ది తెర‌పై చూడాల్సిందే. తదుపరి దల్జిత్ దోసాంజ్‌తో ఇంతియాజ్ అలీ బయోపిక్ 'చమ్ కిలా'లో కూడా పారీ కనిపించనుంది.

కాలేజ్ ఫ్రెండ్స్ న‌డుమ ప్రేమ‌

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా - ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా ప్రేమ క‌థ వెన‌క చాలా స్టోరి ఉంది. ఆ ఇద్ద‌రూ కాలేజ్ డేస్ నుంచి మంచి స్నేహితులు. ఈ స్నేహం ప్రేమ‌గా మారింద‌ని ముంబై మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఈ జంట ప‌లుమార్లు డిన్నర్ డేట్ కు వెళుతుండగా కెమెరాలకు చిక్కారు. ఇంత‌లోనే అంద‌మైన జోడీ పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో క‌థ‌నాలు వైర్ అయ్యాయి. ప‌లుమార్లు ఈ జంట ముంబై .. ఢిల్లీ విమానాశ్రయాలలో క‌లిసి క‌నిపించ‌డంతో వీరిద్ద‌రి డేటింగ్ క‌న్ఫామ్ అయింది.