Begin typing your search above and press return to search.

ట్రాపిక్ లో చిక్కుకుని సింగ‌రైన హీరోయిన్!

ప‌రిణితి కేవ‌లం న‌టి మాత్ర‌మే కాదు. అమ్మ‌డిలో సింగింగ్ ట్యాలెంట్ కూడా ఉంద‌ని తాజాగా బ‌య‌ట ప‌డింది. అయితే అందుకు కార‌కులు మాత్రం రెహ‌మాన్-ఇంతియాజ్ అని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   30 March 2024 6:44 AM GMT
ట్రాపిక్ లో చిక్కుకుని సింగ‌రైన హీరోయిన్!
X

ప్రియాంక చోప్రా క‌జిన్ గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప‌రిణితి చోప్రా సుప‌రిచిత‌మే. అమ్మ‌డు చాలా కాలంగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతుంది. కానీ అక్క‌లా పెద్ద స‌క్స‌స్ అవ్వ‌లేదు. చేస్తుంది అంటే సినిమాలు చేస్తుంద‌నే మాట త‌ప్ప‌! ప‌రిణితి ఇంకా అగ్ర నాయిక‌ల స‌ర‌స‌న చేర‌లేదు. కెరీర్ ఇలా సాగుతోన్న స‌మ‌యంలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ప్ర‌స్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ ని కొనసాగిస్తుంది. వ‌చ్చిన అవ‌కాశాల‌తో కెరీర్ బండిని ముందుకు తీసుకెళ్తుంది.

ప‌రిణితి కేవ‌లం న‌టి మాత్ర‌మే కాదు. అమ్మ‌డిలో సింగింగ్ ట్యాలెంట్ కూడా ఉంద‌ని తాజాగా బ‌య‌ట ప‌డింది. అయితే అందుకు కార‌కులు మాత్రం రెహ‌మాన్-ఇంతియాజ్ అని తెలుస్తోంది. తాను సింగ‌ర్ అవ్వ‌డం అన్న‌ది అనుకోకుండా జ‌రిగింద‌ని తెలిపింది. 'రెండేళ్ల క్రితం క‌ర‌ణ్ జోహార్ పుట్టిన‌రోజు వేడుక‌ల‌కు వెళ్తోన్న స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు ఇంతియాజ్ అలీ నుంచి ఫోన్ కాల్ వ‌చ్చింది. దిల్జీద్.. రెహ‌మాన్ కూడా జూమ్ కాల్ లో ఉన్నారు. ఇప్పుడు మీతో ఇప్పుడు మాట్లాడ‌వ‌చ్చా? అని అడిగారు.

ట్రాపిక్ లో చిక్కుకున్న నా కారు అంతా సౌండ్ తో నిడిపోయింది. వెంట‌నే కారులో ఉన్న‌వారంద‌ర్నీ సైలెంట్ గా ఉండ‌మ‌ని చెప్పా. ఊపిరి సౌండ్ కూడా వినిపించేలా నిశ‌బ్దం ఒక్క‌సారిగా అక్క‌డ చోటు చేసుకుంది. పాటలు పాడ‌టం తెలుసా? అని రెహ‌మాన్ సార్ అడిగారు. పాడ‌టం ఇష్ట‌మ‌ని చెప్పా. జూమ్ కాల్ లోన ద‌మా ధ‌మ్ మ‌స్త్ క‌లంద‌ర్ అనే పాట‌ని పాడ‌మ‌న్నారు. ఆయ‌న అలా అడ‌గ‌గానే నాలో మొద‌ట భ‌యం క‌లిగింది.

కానీ అవ‌కాశం వ‌చ్చింద‌ని ధైర్యంగా పాడాను. ఆ పాట వాళ్ల‌కి బాగా న‌చ్చింది. అందులో న‌ట‌న‌తోనే కాదు..పాట‌ల విషయంలోనూ భాగ‌మ‌వుతున్నాని అప్పుడే అర్ధ‌మైంది. ఇది నా కెరీర్ లో ఎప్ప‌టికీ గుర్తిండిపోయే గొప్ప సంఘ‌ట‌న‌' అని తెలిపింది. అమ‌ర్ సింగ్ చమ్కీలాలా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఏప్రిల్ లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు.