Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆయ‌న ఒడిలో హ‌త్తుకుపోయిన పారీ

పరిణీతి చోప్రా త‌న స్నేహితుడు ఆప్ నాయ‌కుడు రాఘ‌వ్ చ‌ద్దాను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   2 Jan 2024 3:42 AM GMT
ఫోటో స్టోరి: ఆయ‌న ఒడిలో హ‌త్తుకుపోయిన పారీ
X

పరిణీతి చోప్రా త‌న స్నేహితుడు ఆప్ నాయ‌కుడు రాఘ‌వ్ చ‌ద్దాను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట డెస్టినేష‌న్ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు కొత్త సంవ‌త్స‌రం కొత్త జంట ఏం చేస్తోంది? అంటే.. ఇత‌ర సెల‌బ్రిటీ క‌పుల్స్ త‌ర‌హాలోనే ఈ జంట కూడా విదేశీ వెకేష‌న్ ని ఆస్వాధిస్తోంది. త‌న‌ భర్త-రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దాతో క‌లిసి పారీ యూరప్‌లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తమ సెలవుదినం నుండి కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. వీటిలో మొదటి ఫోటోలో దంప‌తులు రెస్టారెంట్‌లో కూర్చుని క‌నిపించారు. అయితే ప‌బ్లిక్ ప్లేస్ లో రాఘవ్ చ‌ద్దా ఒడిలో వాలిపోయి అతడిని హ‌త్తుకుని క‌నిపించింది పారీ. భ‌ర్త రాఘ‌వ్ ఛాతీపై తలను ఆన్చి క‌నిపించింది. ఇది నిజానికి రొమాంటిక్ డేట్ ని త‌ల‌పించింది. రాఘవ్ లేత గోధుమరంగు స్వెటర్ ధరించగా, పరిణీతి క్రీమ్ అండ్ బ్లాక్ దుస్తులలో కనిపించింది. ఇద్దరూ కెమెరాకు పోజులిస్తూ నవ్వులు చిందిస్తున్నారు. పారి షేర్ చేసిన మ‌రో ఫోటోలో ప్యాక్ చేసిన కప్‌కేక్ క్లోజప్ లుక్ క‌నిపించింది.


రాఘవ్‌ని క్ష‌ణ‌మైనా వీడి ఉండ‌దు!


పరిణీతి రాఘవ్ ఒడిలో కూర్చున్న ఆ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ ఇప్పుడు యూత్ లో ప్ర‌కంప‌నాలు సృష్టిస్తోంది. ఈ జంట అన్యోన్య‌త రొమాన్స్ అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. పరిణీతి ఈ పోస్ట్‌కి అంద‌మైన‌ క్యాప్షన్ ఇచ్చింది. ''నా ల‌వ్‌తో క్రిస్మస్ NYE ని నిశ్శబ్దంగా గడిపాను. వారిని గట్టిగా కౌగిలించుకొని అదే మంచం మీద చాక్లెట్ తిన్నాను.. ఇది హాయిగా, వెచ్చగా అనిపించింది. #Austria #London. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! '' అని రాసింది.

రాఘ‌వ్ చ‌ద్దా షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్‌లో రెస్టారెంట్ లోపల కూర్చుని ఉన్న ఫోటోలు..బాల్కనీలో కలిసి పోజులిచ్చిన‌వి ఉన్నాయి. అతడు ఈ పోస్ట్‌కు ఆస‌క్తిక‌ర‌ క్యాప్షన్ ఇచ్చాడు, ''ఆమె నన్ను శాంటా అని పిలిచింది.. కానీ అందరికంటే అద్భుతమైన బహుమతిని పొందింది నేను! మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ప్రేమ, సంతోషం .. శాంతితో నిండివుండాలని కోరుకుంటున్నాను'' అని రాసారు.

పరిణీతి -రాఘవ్ పెళ్లి:

గత ఏడాది సెప్టెంబర్ 24న రాజస్థాన్‌- ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్ హోటల్‌లో సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో పరిణీతి- రాఘవ వివాహం జరిగింది. దీనికి వినోద పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు హాజరయ్యారు. రాఘవ్-పరిణీతి ప్రేమకథ లండన్‌లో ఒక కళాశాలలో కలిసి చదువుకోవడంతో ప్రారంభమైనట్లు సమాచారం. పరిణీతి ఇటీవల 'మిషన్ రాణిగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూ'లో అక్షయ్ కుమార్ సరసన కనిపించింది. ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదలైంది. చమ్కిలాలో దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి పరిణీతి కనిపించనుంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇద్దరు ప్రముఖ పంజాబీ గాయకులైన అమర్‌జోత్ కౌర్ - అమర్ సింగ్ చమ్కిలా చుట్టూ తిరుగుతుంది. అమర్‌జోత్ పాత్రలో పరిణీతి నటిస్తుండగా, దిల్జిత్ చమ్కిలాగా కనిపించనున్నారు.