హేరా ఫేరి 3.. హమ్మయ్య బాబూరావు ఈజ్ బ్యాక్
కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `హేరా ఫేరీ 3` ఇటీవల రకరకాల కారణాలతో వార్తల్లో నిలిచింది.
By: Tupaki Desk | 1 July 2025 12:17 AM ISTకామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `హేరా ఫేరీ 3` ఇటీవల రకరకాల కారణాలతో వార్తల్లో నిలిచింది. ఈ సినిమా పదే పదే వాయిదా పడుతుండటంతో ఎప్పటికి పూర్తవుతుందో అవగాహన లేని పరిస్థితుల్లో కీలక పాత్రధారి అయిన పరేష్ రావల్ దీని నుంచి నిష్కృమించాడని కథనాలొచ్చాయి. తాజా సమాచారం మేరకు.. పరేష్ తిరిగి వస్తున్నారు. దీని గురించి ఫిరోజ్ నదియాద్వాలా మాట్లాడుతూ, సాజిద్ నదియాద్వాలాకు క్రెడిట్ ఇచ్చారు. ``ఇప్పుడు కుటుంబం కలిసి ఉంది``` అని అన్నారు
హెరా ఫేరీ ఫ్రాంచైజ్ మూడవ భాగంపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ ఫ్రాంఛైజీలో బాబు భయ్యా పాత్రలో నటించిన పరేష్ రావల్ కొన్ని సందిగ్ధతలు, చట్టపరమైన ఇబ్బందులతో పని లేకుండా తిరిగి అధికారికంగా హెరా ఫేరీ 3 టీమ్ లోకి తిరిగి వచ్చారు. హేరా ఫేరీ కుటుంబం తిరిగి కలిసిందని నిర్మాత ఫిరోజ్ నదియాద్వాలా ధృవీకరించారు, సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్రలు పోషించినందుకు అతని సోదరుడు సాజిద్ నదియాద్వాలా, దర్శకనిర్మాత అహ్మద్ ఖాన్‌కు క్రెడిట్ ఇచ్చారు.
హెరా ఫేరీ 3 లోకి పరేష్ రావల్ తిరిగి రీయునైట్ అవ్వడం గురించి ఫిరోజ్ నదియాద్వాలా మాట్లాడుతూ..``కుటుంబం ఇప్పుడు కలిసి ఉంది``` అని వ్యాఖ్యానించారు. నా సోదరుడు సాజిద్ నదియాద్వాలా- మిస్టర్ అహ్మద్ ఖాన్ ల ప్రేమ, గౌరవం, దయగల మార్గదర్శకత్వంతో హేరా ఫేరీ కుటుంబం తిరిగి కలిసి వచ్చింది. నా సోదరుడు సాజిద్ ఈ విషయాన్ని పరిష్కరించడానికి చాలా రోజులుగా ప్రయత్నించాడు. 10 సంవత్సరాలకు పైగా మా మధ్య బంధం ఉంది అని అన్నారు.
