Begin typing your search above and press return to search.

అడ్వాన్స్ వెన‌క్కిచ్చి 25కోట్ల దావాను ముగించాడు!

బ్లాక్ బ‌స్ట‌ర్ హేరా ఫేరి ఫ్రాంఛైజీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించిన సీనియ‌ర్ న‌టుడు ప‌రేష్ రావ‌ల్ అందరికీ పెద్ద షాకిచ్చాడు.

By:  Tupaki Desk   |   25 May 2025 7:44 PM
అడ్వాన్స్ వెన‌క్కిచ్చి 25కోట్ల దావాను ముగించాడు!
X

బ్లాక్ బ‌స్ట‌ర్ హేరా ఫేరి ఫ్రాంఛైజీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించిన సీనియ‌ర్ న‌టుడు ప‌రేష్ రావ‌ల్ అందరికీ పెద్ద షాకిచ్చాడు. ముఖ్యంగా ఈ సినిమాని నిర్మిస్తున్న ఖిలాడీ అక్ష‌య్ కుమార్ కి ఊహించ‌ని జోల్ట్ ఇది. అస‌లు ఈ సినిమాకి అత్యంత కీల‌క‌మైన పాత్ర ప‌రేష్ న‌టించిన బాబూరావు అలియాస్ బాబూజీ భ‌య్యా! ఇప్పుడు మూడో భాగానికి ఇది అత్యంత కీల‌కం. కానీ ఇంత‌లోనే ప‌రేష్ రావ‌ల్ తాను ప్రాజెక్ట్ నుంచి నిష్కృమిస్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు.

ఈ ఆక‌స్మిక నిర్ణ‌యానికి చిత్ర‌బృందం షాక్ కి గురైంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అక్ష‌య్ కి చెందిన నిర్మాణ సంస్థ ప‌రేష్ రావ‌ల్ పై కోర్టులో 25 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం కింద దావా వేయడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అస‌లు ప‌రేష్ తో గొడ‌వేంటి? అన్న‌ది ఇప్ప‌టికీ బ‌య‌టికి రాలేదు. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ ఏవీ లేవ‌ని ప‌రేష్ అంటున్నారు... కానీ అత‌డు నిర్మాత‌ల‌పై చాలా చిరాకు ప‌డి బ‌య‌ట‌కు పోయాడు.

కోర్టులో దావా వేసినా కానీ, పెద్ద‌ల స‌మ‌క్షంలో స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కుదుర్చుకున్నార‌నేది తాజాగా అందిన వార్త‌. ప‌రేష్ తాను తీసుకున్న 11 ల‌క్ష‌ల అడ్వాన్స్, దానిపై 15 శాతం వ‌డ్డీ క‌లుపుకుని అద‌నంగా పెద్ద‌ మొత్తాన్ని అక్ష‌య్ కి అంద‌జేసాడ‌ట‌. దీంతో ఈ వివాదం స‌ద్ధుమ‌ణిగింద‌ని కూడా చెబుతున్నారు. అత‌డు క్రేజీ ఫ్రాంఛైజీ నుంచి వైదొల‌గ‌డానికి కార‌ణం, ప్రాజెక్ట్ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతుండ‌డ‌మేన‌ని చెబుతున్నారు. ప‌రేష్ రావ‌ల్ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుని ఇప్పుడు ఫ్రీ అయిపోయాడు. అత‌డు ఇక‌పై త‌న త‌దుప‌రి చిత్రాల‌పై దృష్టి సారించ‌గ‌ల‌డు! అని తెలుస్తోంది.

బాలీవుడ్ హంగామా క‌థ‌నం ప్రకారం, ప‌రేష్ ఈ చిత్రం కోసం అందుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి వెన‌క్కి ఇచ్చేసాడు. సిరీస్ నుండి వైదొలగడానికి కొంచెం ఎక్కువ డబ్బును తిరిగి ఇచ్చాడు. నిజానికి ప‌రేష్ కి ఈ పాత్ర కోసం 15 కోట్లు ఆఫ‌ర్ చేసారు. టర్మ్ షీట్ లో పరేష్ రావల్ కు చెల్లించాల్సిన‌ మిగిలిన మొత్తం - రూ. 14.89 కోట్లు. సినిమా విడుదలైన ఒక నెల తర్వాత మాత్రమే అందుతుందని పేర్కొన్నట్టు తెలిసింది. కానీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని, 2026 చివరిలో లేదా 2027లో విడుదల కానుందని భావిస్తున్నందున, చెల్లింపులో జాప్యం రావల్ ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించాలనే నిర్ణయం వెనుక ముఖ్య కారణమని తెలుస్తోంది. హేరాఫేరి 3 ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో చాలా ఆల‌స్య‌మైంది. ఇంత‌కాలం ఓపిగ్గా ఎదురు చూసిన అత‌డు ఇప్పుడు నిర్ధ‌య‌గా వైదొలిగాడు. ఇది అక్ష‌య్ అత‌డి బృందం ఊహించ‌నిది.

ఎట్ట‌కేల‌కు అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ తో ప‌రేష్ చట్టపరమైన వివాదానికి ముగింపు ప‌లికారు. ఇక అత‌డు 25 కోట్లు చెల్లించాల్సిన ప‌ని లేదు. ప్రస్తుతం, ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో షూట్ మాత్రమే పూర్తయింది. దీనిని భూత్ బంగ్లా సెట్స్‌లో చిత్రీకరించినట్లు సమాచారం. ఫ్రాంఛైజీలో హేరా ఫేరీ (2000), ఫిర్ హేరా ఫేరీ (2006) సినిమాలు కల్ట్ క్లాసిక్స్ గా రికార్డుల‌కెక్కాయి. వీటిలో బాబూరావుగా రావల్ నటన ఫ్రాంచైజీకి క‌లిసొచ్చిన అంశం. అత‌డు వైదొల‌గ‌డంతో ఆ పాత్ర‌కు ఎవ‌రిని తీసుకుంటారు? అన్న‌ది ఆస‌క్తిగా మారింది.