Begin typing your search above and press return to search.

హిట్ ప్రాంచైజీ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌

బాలీవుడ్‌ హిట్‌ ప్రాంచైజీలో హేరా ఫేరి ఒకటి. ఇప్పటికే రెండు పార్ట్‌లు ఈ సినిమాలో వచ్చాయి.

By:  Tupaki Desk   |   30 Jun 2025 8:41 AM
హిట్ ప్రాంచైజీ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌
X

బాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో ప్రాంచైజీ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇటీవల వచ్చిన హౌస్‌ఫుల్‌ ప్రాంచైజీ సినిమాకు ఏ స్థాయిలో స్పందన దక్కిందో మన అందరికీ తెలిసిందే. అందుకే మరిన్ని ప్రాంచైజీ సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలీవుడ్‌ ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల నుంచి బయట పడాలి అంటే కచ్చితంగా ప్రాంచైజీ సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రాంచైజీ సినిమాలకు మంచి పబ్లిసిటీ దక్కుతుంది. అందుకే చాలా మంది ప్రాంచైజీ సినిమాలను తీసుకు వచ్చేందుకు ఆసక్తిని కనబర్చడం మనం చూస్తూ ఉన్నాం.

బాలీవుడ్‌ హిట్‌ ప్రాంచైజీలో హేరా ఫేరి ఒకటి. ఇప్పటికే రెండు పార్ట్‌లు ఈ సినిమాలో వచ్చాయి. మూడో పార్ట్‌ కోసం సినీ ప్రేమికులు ముఖ్యంగా ఈ సినిమాను అభిమానించే ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హేరా ఫేరి సినిమాలో అక్షయ్‌ కుమార్‌, సునీల్‌ శెట్టి, పరేష్‌ రావల్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ మధ్య హేరా ఫేరి 3 సినిమా ప్రకటన వచ్చింది. ఈ ప్రాంచైజీ నుంచి పరేష్ రావల్‌ తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో పరేష్ రావల్‌ సైతం మీడియాతో మాట్లాడుతూ తాను ఆ సినిమాలో భాగం కావడం లేదని అన్నాడు. అక్షయ్‌ కుమార్‌తో ఉన్న విభేదాల కారణంగానే ఆయన తప్పుకున్నాడనే వార్తలు వచ్చాయి.

హేరా ఫేరి 3 సినిమాలో పరేష్‌ రావల్ నటించడం లేదనే వార్తలపై అక్షయ్‌ కుమార్ సైతం స్పందించాడు. ఆయన ఇండైరెక్ట్‌గా ఆ సమయంలో పరేష్‌ రావల్‌ పై అసహనం వ్యక్తం చేసినట్లుగా వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరి మధ్య గ్యాప్ చాలా ఉందని, కలిసి నటించడం సాధ్యం కాకపోవచ్చు అని అంతా భావించారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఈ ప్రాంచైజీలో పరేష్ రావల్‌ నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హేరా ఫేరీ 3 గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను చేసిన హేరా ఫేరీ సినిమా పై ప్రేక్షకులు చూపించిన అభిమానంను ఎప్పటికీ మరచిపోలేను అన్నాడు.

హిట్‌ ప్రాంచైజీ లో సినిమా రాబోతున్న నేపథ్యంలో తప్పకుండా అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమాను రూపొందించే ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తాను హేరా ఫేరీ 3 లో భాగస్వామ్యం కాబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. త్వరలోనే షూటింగ్‌ సైతం ప్రారంభం కాబోతున్నట్లు ఆయన పేర్కొన్నాడు. ఆ షూటింగ్‌లో తాను పాల్గొంటాను అన్నాడు. అంతే కాకుండా ప్రేక్షకులు హేరా ఫేరీ 3 ను ఎలా అయితే కోరుకుంటున్నారో అలాగే ఉంటుంది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ సినిమా ఉంటుంది అని హామీ ఇచ్చాడు. పరేష్ రావల్ వ్యాఖ్యలతో ప్రాంచైజీ చుట్టూ అలుముకున్న నీలి నీడలు తప్పుకున్నాయి. ఇక సినిమా షూటింగ్‌ ప్రారంభం కావడం ఖాయం అని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.