మూడు దశాబ్దాలకు మళ్లీ ఒక్కటైన జంట!
ఒక్కసారి దూరమైన బంధం మళ్లీ కలవడం అన్నది దాదాపు అసాధ్యం. విడాకుల పేరుతో వెంటనే వేరవుతున్నారు.
By: Tupaki Desk | 1 July 2025 4:00 PM ISTఒక్కసారి దూరమైన బంధం మళ్లీ కలవడం అన్నది దాదాపు అసాధ్యం. విడాకుల పేరుతో వెంటనే వేరవుతున్నారు. కనీసం ఆరు నెలలు కూడా సమయం మించకుండానే మ్యూచవల్ అండర్ స్టాండింగ్ పై విడా కులు తీసుకుంటున్నారు. గొడవలొచ్చాయి...తెలిసో తెలియకో మనస్పర్దలొచ్చాయి. కొన్నాళ్లు ఆగితే అన్ని సర్దుకుంటాయని ఆలోచించే పరిస్థితి లేదు. కానీ ఓ ఫేమస్ జంట మాత్రం విడిపోయిన మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసి సంచలనం రేపారు.
ఇంతకీ ఎవరా జంట? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. బాలీవుడ్ సినీయర్ నటుడు రణ్‌ధీర్ కపూర్- బబిత 1971లో ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజ్ కపూర్ చిత్రం 'సంగమ్' సెట్స్‌లో బబితను చూసిన రణ్‌ధీర్ ప్రేమలో పడ్డారు. అటుపై ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహమైంది. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విబేధాలు తలెల్తాయి. దీంతో 1988లో రణ్‌ధీర్ తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.
అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు . కానీ చట్టపరంగా విడాకులు తీసుకోలేదు. అప్పటికే ఇద్దరు పిల్లలు కలరు. వారే కరీనా కపూర్-కరీష్మా కపూర్. అయితే ఈ మద్యనే విడిపోయిన తన తల్లిదండ్రులు మళ్లీ ఒక్కటైన్లు కరీనా కపూర్ వెల్లడించారు. దశాబ్దాలుగా వేర్వేరుగా జీవితం గడుపుతున్న ఇద్దరు వృద్ధాప్యాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్నారని తెలిపింది. బర్ఖా దత్‌తో జరిగిన సంభాషణలో కరీనా ఈ విషయాలు రివీల్ చేసింది.
నాకు, నా సొదరికి ఇది ఒక జీవితచక్రం పూర్తికావడం లాంటిది. ఇదొక దైవిక జోక్యంలా, దైవ సంకల్పంలా జరిగింది. వారి జీవిత ప్రయాణం ఎక్కడ మొదలైందో? మళ్లీ సరిగ్గా అక్కడికే చేరింది. కరీనా, కరిష్మా కపూర్ సినీ ప్రయాణంలో తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో సహకరించడంతోనే ఈ స్తాయిలో ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు.
