సంక్రాంతి సినిమా.. ఆ హీరో రిజెక్ట్ చేశాడా..
కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ లీడ్ రోల్ లో సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా.. జనవరి 10న థియేటర్స్ లోకి వచ్చింది.
By: M Prashanth | 12 Jan 2026 10:00 PM ISTసంక్రాంతి పండుగ కానుకగా పరాశక్తి మూవీ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజైన విషయం తెలిసిందే. కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ లీడ్ రోల్ లో సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా.. జనవరి 10న థియేటర్స్ లోకి వచ్చింది. 1960లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఆ మూవీ.. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోలేకపోయింది.
అయితే ఆ సినిమాలో స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో నటించాల్సి ఉంది. తొలుత ఆయనకే సుధా కొంగర కథ వినిపించారు. సూర్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని నెలల తరబడి పూర్తి స్క్రిప్ట్ పై చర్చలు జరగ్గా.. ప్రాజెక్టు నుంచి సూర్య అనూహ్యంగా తప్పుకున్నారు. అందుకు అసలు కారణం బయటకు రాకపోయినా.. సినిమాలో నటించలేదు. అప్పట్లో ఆ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకంటే అప్పటికే వారిద్దరూ కలిసి చేసిన సూరరై పోట్రు మూవీ ఎలాంటి విజయం సాధించిందో తెలిసిన విషయమే. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆ సినిమా.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. సూర్య కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. అందులో ఆయన నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. అలాంటి హిట్ కాంబినేషన్ రిపీట్ అయితే మరో సూపర్ హిట్ పక్కా అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ సూర్య మాత్రం.. సినిమా నుంచి తప్పుకున్నారు.
ఆ తర్వాత హీరోగా శివకార్తికేయన్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో కావడంతో ఆయన సరిగ్గా సరిపోతారని భావించారు. కానీ సినిమా స్టోరీ నెమ్మదిగా ఉండటం, ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చేయలేకపోవడం మైనస్ గా మారాయి. రాజకీయ అంశాలు, అప్పటి పరిస్థితులు చూపించాలన్న ప్రయత్నం చేసినప్పటికీ, అవి ప్రేక్షకులకు అంతగా నచ్చలేదనే టాక్ వినిపిస్తోంది.
ఎలాంటి పోటీ లేకపోయినా కూడా మొదటి రోజు నుంచే నెగిటివ్ రివ్యూలు రావడంతో థియేటర్లలో కలెక్షన్లు తగ్గిపోయాయి. దీంతో పరాశక్తి శివకార్తికేయన్ కెరీర్ లో మరో ఫ్లాప్ గా మిగిలిపోయింది. దీంతో ఇప్పటి పరిస్థితి చూస్తే వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సూర్య.. పరాశక్తి నుంచి తప్పుకోవడం మంచిదే అయిందని సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. సూర్య ఆ సినిమా చేసినా ఫలితం మారేది కాదని, ఆయన ఖాతాలో మరో ఫ్లాప్ చేరేదని అంటున్నారు.
సూర్య ఎందుకు తప్పుకున్నారనేది ఎవరికీ తెలియకపోయినా.. తీసుకున్న నిర్ణయం సరైనదని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుండగా.. త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మరి ఆ సినిమాతో అయినా సూర్య గట్టి కమ్ బ్యాక్ ఇస్తారా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..
