Begin typing your search above and press return to search.

సుంద‌రి ఇలా భ‌య‌ప‌డితే ఎలా?

స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే బాక్సాఫీస్ వ‌ద్ద వార్ త‌ప్ప‌దు. రిలీజ్ ల విష‌యంలో హీరో లెవ‌రు రాజీ ప‌డే ప‌రిస్థితి ఉండ‌దు.

By:  Tupaki Desk   |   22 Jun 2025 3:00 PM IST
సుంద‌రి ఇలా భ‌య‌ప‌డితే ఎలా?
X

స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే బాక్సాఫీస్ వ‌ద్ద వార్ త‌ప్ప‌దు. రిలీజ్ ల విష‌యంలో హీరో లెవ‌రు రాజీ ప‌డే ప‌రిస్థితి ఉండ‌దు. ఒక‌రికొక‌రు సై అంటూ దూసుకొస్తారు. పోటీగా ఎన్ని సినిమాలున్నా స‌రే ఆ సీజ‌న్ టార్గెట్ గా బ‌రిలోకి దిగుతుంటారు. బాక్సాఫీస్ వ‌ద్ద ఇలాంటి పోటీ వాతావ‌ర‌ణం ఎన్నోసార్లు చూసిం దే. అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ ఇలాంటి పోటీ క‌నిపిస్తుంటుంది. ఇలాంటి కాంపిటీష‌న్ నుంచి ఎగ్జిట్ అయ్యేది చిన్నా చితకా చిత్రాలు త‌ప్ప‌! పెద్ద చిత్రాలేవి త‌ప్పుకోవు.

అయితే బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో, హీరోయిన్ న‌టిస్తున్న చిత్రం మాత్రం ఇలాంటి పోటీ నుంచి ఎగ్జిట్ అయి ఆశ్చ‌ర్య ప‌రిచింది. వివ‌రాల్లోకి వెళ్తే జులైలో బాలీవుడ్ నుంచి చాలా సినిమాలు రిలీజ్ అవుతు న్నాయి. చాలా కాలంగా కొత్త రిలీజ్ లు లేక బోసి బోయిన బాలీవుడ్ థియేట‌ర్లు జులైలో కొత్త రిలీజ్ ల‌తో క‌ళ‌క‌ళ లాడ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో సిద్దార్ధ్ మ‌ల్హోత్రా, జాన్వీక‌పూర్ జంట‌గా తుషాల్ జ‌లోటా తెర‌కెక్కించిన `ప‌ర‌మ్ సుంద‌రి` కూడా జులై 25న రిలీజ్ తేదీ ఫిక్స్ చేసుకుంది.

అధికారికంగా రిలీజ్ తేదీ కూడా ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడీ సినిమా వాయిదా ప‌డింద‌ని స‌మాచారం. అందుకు కార‌ణం ఆ నెల‌లో చాలా సినిమాలు రిలీజ్ కు ఉండ‌టంతోనే త‌మ చిత్రాన్ని వాయిదా వేసుకో వాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారుట‌. అన్ని అనుకూలంగా ఉంటే ఆగ‌స్టులో రిలీజ్ చేయాల‌నుకుంటున్నా రుట‌. దీంతో ప‌ర‌మ్ సుంద‌రి కంటెంట్ పై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

రిజ‌ల్ట్ ముందే ఊహించి పోటీలో ఎందుక‌ని వాయిదా వేస్తున్నారా? లేక పోటీని త‌ట్టుకుని నిల‌బ డ‌లేద‌ని వాయిదా వేస్తున్నారా? ఇదేం చిన్న సినిమా కాదే? స్టార్ క్యాస్టింగ్ ఉన్న చిత్ర‌మే ? వాయిదా ఏ కార‌ణంగా అంటూ నెట్టింట కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది. ఈ చిత్రాన్ని దినేష్ విజ‌న్ నిర్మిస్తున్నారు.