సుందరిపై చినుకు పడకుండా ప్రియుడు ఆరాటం!
సిద్దార్ధ్ మల్హోత్రా-జాన్వీకపూర్ జంటగా తుషార్ జలోటా దర్శకత్వంలో `పరమ్ సుందరి` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 Jun 2025 11:28 AM ISTసిద్దార్ధ్ మల్హోత్రా-జాన్వీకపూర్ జంటగా తుషార్ జలోటా దర్శకత్వంలో `పరమ్ సుందరి` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇదొక క్రాస్ కల్చర్ రొమాంటిక్ డ్రామా. నార్త్ అబ్బాయి-సౌత్ అమ్మాయి మధ్య నడిచే కథ. ఇందులో నార్త్ కుర్రాడి పాత్రలో సిద్దార్ద్...కేరళ అమ్మాయి పాత్రలో జాన్వీ కపూర్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు...ప్రచార చిత్రాలతో పరమ్ సుందరిపై మంచి హైప్ క్రియేట్ అవుతుంది.
ఇలాంటి జానర్లో ఇంతవరకూ ఏ డైరెక్టర్ సినిమా చేయలేదు. తొలిసారి రెండు వేర్వేరు ప్రాంతాలను కలు పుతూ తీస్తోన్న చిత్రం కావడంతో? ఎలా ఉంటుంది? అన్న ఆసక్తి నెలకొంది. తాజాగా నెట్టింట ఓ ఇంట్రె స్టింగ్ ఫోటో వైరల్ అవుతుంది. అచ్చం కేరళ అమ్మాయిగా ముస్తాబైన జాన్వీకపూర్ ఎంతో అందంగా ఉంది. చీర...జాకెట్ లో నేచురల్ బ్యూటీని తలపిస్తుంది. తలలో మల్లె చెండులు... పెదాలపై అందమైన నవ్వు తూ జాన్వీ ఎంతో అందంగా కనిపిస్తుంది.
ఆ అందంపై చినుకు వాలకుండా సిద్దార్ద్ జాన్వీ తలపై రెండు చేతులు అడ్డు పెట్టడం చూడొచ్చు. చిత్రీ కరణ అనంరం తీసిన ఓ పిక్ ఇది. ఇద్దరు ముంబైలోని మాడ్డాక్ ఫిల్మ్స్ కార్యాలయంలోకి ప్రవేశి స్తున్న ప్పుడు తీసిన ఫోటో ఇది. ప్రేమ్ లో ఇద్దరు ఎంతో అందంగా చిక్కారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఫోటోలోనే ఇంత అందంగా ఉన్నారంటే తెరపై ఇంకెంత అందంగా కనిపిస్తుందో ఈ జోడీ.
ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం కేరళలోని సుందరమైన ప్రదేశాల్లో జరిగింది. ప్రకృతి రమణీయత మధ్యలో సన్నివేశాలు ఇంకెంత అందంగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే షూటింగ్ పూర్త యింది. త్వరలోనే ప్రచారం పనులు మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. అన్ని పనులు పూర్తి చేసి జులై 25న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
