ముసలాడితో జాన్వీ కపూర్ రొమాన్స్.. పరమ్ సుందరి కాంబోపై విమర్శలు!
జాన్వీ కపూర్ , సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన పరమ్ సుందరి (Param Sundari) మూవీ ఆగస్టు 29న విడుదల కాబోతోంది.
By: Tupaki Desk | 2 Aug 2025 5:00 PM ISTజాన్వీ కపూర్ , సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన పరమ్ సుందరి (Param Sundari) మూవీ ఆగస్టు 29న విడుదల కాబోతోంది. బాలీవుడ్ జనాలు ప్రస్తుతం వార్-2(War-2) మూవీ గురించి వేచి చూస్తున్న తరుణంలో.. తన సినిమా డేట్ ని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు డైరెక్టర్.. ఎన్నో అంచనాలతో పరమ్ సుందరి మూవీని విడుదల చేయడానికి రెడీ అయిపోయారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే పరమ్ సుందరి మూవీలో జంటగా నటించిన జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రాల ఏజ్ గ్యాప్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. చాలామంది ఈ జంటను టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.
తుషార్ జాలోట (Tushar Jalota) డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఒకే ఒక్క అంశం మాత్రం సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ కి గురవుతోంది. అదే హీరో, హీరోయిన్ మధ్య ఏజ్ గ్యాప్.. జాన్వీ కపూర్(Janhvi Kapoor), సిద్ధార్థ్ మల్హోత్రా (Siddharth Malhotra) మధ్య 12 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండడంతో చాలామంది ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా ముసలాడితో జాన్వీ కపూర్ రొమాన్స్ చేయడం ఏంటి? అంటూ చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం.
వాస్తవానికి ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో నటించిన హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ పై ట్రోల్స్ వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే అటు ఈ ఏజ్ గ్యాప్ పై వచ్చిన ట్రోలింగ్ ని హీరో, హీరోయిన్లు తిప్పికొట్టే ప్రయత్నం చేసినా ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అస్సలు బాలేదని, ఏజ్ గ్యాప్ స్పష్టంగా తెలిసిపోతోందని, ఇద్దరితో బలవంతంగా కెమిస్ట్రీ పండించినట్టు స్పష్టంగా అర్థం అవుతోందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు వీరిద్దరి ఏజ్ గ్యాప్ వల్ల సినిమాలోని ప్రేమ కథకి కూడా దెబ్బ పడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు అచ్చం అన్నా చెల్లెళ్లలాగే ఉన్నారని కూడా అంటున్నారు. మేకప్ వేసి ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎంత తగ్గించాలనుకున్నా కూడా చూసే ఆడియన్స్ ఇట్టే కనిపెట్టేస్తారు అని, ఈ సినిమా నటీనటుల ఎంపిక చాలా దరిద్రంగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే వీరి కామెంట్లకు మరికొంతమంది కౌంటర్లు ఇస్తున్నారు.. షారుక్ ఖాన్ - దీపికా పదుకొనే (Shahrukh Khan- Deepika Padukone) ఓంశాంతి మూవీలో నటించినప్పుడు 20 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అయినా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వలేదా..
ఇలియానా - అజయ్ దేవగన్ (Ileana-Ajay Devgn) కాంబోలో వచ్చిన బాద్షాహో మూవీ మంచి హిట్ అయింది. కానీ వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 18 సంవత్సరాలు.. అయినా కూడా సినిమాని ఆదరించారుగా.. అలాగే అక్షయ్ కుమార్ - ప్రియాంక చోప్రా, మాధవన్ - కంగనా రనౌత్, ఆదిత్య రాయ్- కపూర్ సారా అలీఖాన్ వంటి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాయి.కానీ ఈ హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ 10 సంవత్సరాల కంటే ఎక్కువగానే ఉంది. ఎక్కువ ఏస్ గ్యాప్ తో వచ్చిన ఇన్ని సినిమాలు హిట్ అయినప్పుడు.. పరమ్ సుందరి సినిమా విషయంలో మాత్రం ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు అంటూ ఇచ్చి పడేస్తున్నారు. మొత్తానికైతే ఒక ఏజ్ గ్యాప్ కారణంగానే ఇప్పుడు భారీ ట్రోల్స్ ఎదుర్కొంటోందని చెప్పవచ్చు.
