Begin typing your search above and press return to search.

రీతూవ‌ర్మ‌తో డేటింగ్‌పై మెగా మేన‌ల్లుడు క్లారిటీ

సోషల్ మీడియాల్లో యువ‌క‌థానాయిక‌ రీతూవర్మ ఒక మెగా హీరోతో శృంగార సంబంధంలో ఉందంటూ ప్ర‌చారం సాగుతోంది

By:  Tupaki Desk   |   23 Nov 2023 5:12 AM GMT
రీతూవ‌ర్మ‌తో డేటింగ్‌పై మెగా మేన‌ల్లుడు క్లారిటీ
X

సోషల్ మీడియాల్లో యువ‌క‌థానాయిక‌ రీతూవర్మ ఒక మెగా హీరోతో శృంగార సంబంధంలో ఉందంటూ ప్ర‌చారం సాగుతోంది. అల్లు అర్జున్ హోస్ట్ చేసిన వరుణ్ తేజ్ - లావణ్య జంట ప్రీ-వెడ్డింగ్ వేడుక ఫోటోగ్రాఫ్‌లలో రీతూ వర్మ ఉండటం వల్ల ఈ పుకార్లు మొద‌ల‌య్యాయి. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఊహాగానాలకు ఆజ్యం పోసాయి. మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ తో రీతూ ప్రేమ‌లో ఉందంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు.

వాస్తవానికి ఈ పుకార్లు పూర్తిగా అవాస్తవం. ఊహాగానాలు మాత్ర‌మేన‌ని క్లారిటీ ఇచ్చాడు వైష్ణ‌వ్ తేజ్. ఆదికేశ‌వ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా తాజా ఇంట‌ర్వ్యూలో వైష్ణ‌వ్ తేజ్ మాట్లాడుతూ.. రీతూ వర్మ - లావణ్య త్రిపాఠి చిత్ర పరిశ్రమలో క్లోజ్ ఫ్రెండ్స్. అందువ‌ల్ల ఆ ఈవెంట్లో రీతూ కూడా క‌నిపించింద‌ని వైష్ణ‌వ్ అన్నారు. లావణ్య స్నేహితురాలిగా రీతూ వర్మ వేడుకకు హాజరయ్యారని తెలిపారు. అంత‌కుమించి త‌మ మ‌ధ్య ఇంకేదీ లేద‌ని కూడా అన్నాడు.

ఇంత‌కుముందు వ‌రుణ్ తేజ్ పైనా ఇవే సందేహాలు. నిజానికి మెగా ఫ్యామిలీ ఫోటోలలో లావణ్య త్రిపాఠి చేర‌డం మొదట్లో సందేహాల‌ను రేకెత్తించింది. అయితే వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి జంట‌ ప్రేమకథ వెలుగులోకి వచ్చినప్పుడు అంద‌రికీ దానిపై క్లారిటీ వ‌చ్చింది. ఇప్పుడు కూడా వైష్ణ‌వ్ తేజ్- రీతు వ‌ర్మ‌పై అదే త‌ర‌హా ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ త‌మ‌పై జ‌రుగుతున్న‌ది అంతా త‌ప్పుడు ప్ర‌చార‌మేనని మెగా హీరో తేజ్ క్లారిటీ నిచ్చాడు. అవ‌న్నీ ఊహాగానాలు అని కొట్టి పారేసాడు. మెగా ఫ్యామిలీ బ్యాచిల‌ర్స్ గా సాయి ధ‌రమ్ తేజ్- వైష్ణ‌వ్ తేజ్ పై ఇలాంటి ఊహాగానాలు రొటీన్ గా మారుతున్నాయి.

వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం ఆదికేశ‌వ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో కాళేశ్వర్ రెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో వైష్ణ‌వ్ నటించాడు. శ్రీలీల క‌థానాయిక‌గా న‌టించింది. మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్, రాధిక త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రం నవంబర్ 24 న విడుదల కానుంది.